తెలంగాణ

telangana

ETV Bharat / sports

వింబుల్డన్​ 2019: ఒసాకా, వీనస్​ ఇంటిముఖం​

వింబుల్డన్​ తొలిరోజే సంచలనాలు నమోదయ్యాయి. టైటిల్​ ఫేవరెట్​గా బరిలోకి దిగిన రెండో సీడ్​ ఒసాకా(జపాన్​) ఆరంభంలోనే ఇంటిముఖం పట్టింది. అన్​సీడెడ్​ పుతిన్​త్సెవా(కజకిస్థాన్​) తొలిరౌండ్​లో ఆమెకు షాకిచ్చింది. మరోవైపు 15 ఏళ్ల వయసులో మెగాటోర్నీలో అడుగుపెట్టిన కోరి గాఫ్(అమెరికా)​... దిగ్గజ క్రీడాకారిణి వీనస్​ విలియమ్స్​ను మట్టికరిపించింది.

వింబుల్డన్​ 2019: ఒసాకా, వీనస్​ ఇంటిముఖం​

By

Published : Jul 2, 2019, 8:00 AM IST

లండన్​ వేదికగా ప్రారంభమైన వింబుల్డన్​లో తొలిరోజు ఊహించని ఫలితాలు ఎదురయ్యాయి. టైటిల్​ ఫేవరెట్లుగా బరిలోకి దిగిన క్రీడాకారిణులు టోర్నీ మొదటి రౌండ్​లోనే నిష్క్రమించారు.

వింబుల్డన్​ 2019: పుతిన్​త్సెవా, గాఫ్​ హైలైట్స్​

ప్రపంచ నెంబర్-​2 నవోమి ఒసాకా(జపాన్​) తొలి రౌండ్​నే ఛేదించలేకపోయింది. సోమవారం జరిగిన పోరులో పుతిన్​త్సెవా(కజకిస్థాన్​) 7-4, 6-2తో ఒసాకాను ఓడించింది.

ఛాంపియన్​కు షాక్​...

పిన్న వయసులోనే వింబుల్డన్‌ మెయిన్‌ డ్రాకు అర్హత సాధించి చరిత్ర సృష్టించిన అమెరికా యువక్రీడాకారిణి 15 ఏళ్ల కోరి గాఫ్‌... గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో అద్భుత విజయం సొంతం చేసుకుంది. 39 ఏళ్ల వీనస్‌ విలియమ్స్‌కు తొలి రౌండ్‌లోనే షాకిచ్చింది. ఐదుసార్లు ఛాంపియన్​ వీనస్​ విలియమ్స్​ను సోమవారం జరిగిన పోరులో 6-4, 6-4 తేడాతో మట్టికరిపించింది గాఫ్​. 1991 తర్వాత వింబుల్డన్‌లో తొలి రౌండ్‌ నెగ్గిన పిన్న వయస్కురాలిగానూ కోరి గాఫ్‌ ఘనత సాధించింది.

ఏడో సీడ్​ హలెప్​(రొమేనియా), మూడో సీడ్​ ప్లిస్కోవా(చెక్​ రిపబ్లిక్​) శుభారంభం చేశారు. మొదటి రౌండ్​లో హలెప్​ 6-4, 7-5తో సస్నోవిచ్​ (బెలారస్​)పై నెగ్గింది. ప్లిస్కోవా 6-2, 7-4తో లిన్​ జు (చైనా)ను ఓడించింది. స్వితోలినా(ఉక్రెయిన్​), మాడిసన్​ కీస్​(అమెరికా), రిబరికోవా(స్లొవేకియా), సెవత్సొవా(లాత్వియా)రెండో రౌండ్లో అడుగుపెట్టారు.

ABOUT THE AUTHOR

...view details