పారిస్లో కరోనా తీవ్రతరం అవుతుండటం వల్ల.. ఫ్రెంచ్ ఓపెన్‌లో పాల్గొనే ప్రేక్షకుల పరిమితిని కుదించారు. రోజుకు 1000 మందిని మాత్రమే అనుమతించాలని అధికారులు నిర్ణయించారు. అయితే ఆటగాళ్లు, కోచ్లు, నిర్వహకులు ఇతర సిబ్బందికి ఈ నిబంధన వర్తించదని స్పష్టం చేశారు.
ఫ్రెంచ్ ఓపెన్‌లో ప్రేక్షకుల పరిమితి కుదింపు - స్పోర్ట్స్ న్యూస్
ఫ్రెంచ్ ఓపెన్‌లో ప్రేక్షకుల పరిమితిని వేయికి తగ్గించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న కారణంగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
![ఫ్రెంచ్ ఓపెన్‌లో ప్రేక్షకుల పరిమితి కుదింపు French Open](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8934769-1039-8934769-1601031086716.jpg)
ఫ్రెంచ్ ఓపెన్
గతంలో ఈ టోర్నీకి రోజుకు 11వేల మందికిపైగా అనుమతించాలని నిర్ణయించగా.. వైరస్ వ్యాప్తి కారణంగా 5 వేలకు కుదించింది అక్కడి ప్రభుత్వం. ఇప్పుడు మహమ్మారి ఉద్ధృతి మరింత పెరగడం వల్ల 1000 మందికి పరిమితం చేసింది.