తెలంగాణ

telangana

ETV Bharat / sports

'రఫాతో మ్యాచ్ అదుర్స్.. జకోతో కష్టమే' - wimbelden

రఫాతో మ్యాచ్​ను తను ఎప్పుడూ ఆస్వాదిస్తానని వింబుల్డన్ సెమీస్ అనంతరం రోజర్ ఫెదరర్ చెప్పాడు. ఫైనల్లో జకోతో మ్యాచ్​ రసవత్తరంగా సాగనుందని తెలిపాడు.

ఫెదరర్​

By

Published : Jul 13, 2019, 11:24 AM IST

వింబుల్డన్​లో రఫెల్​ నాదల్​పై గెలిచిన మ్యాచ్​ తనకెంతో ఇష్టమైన మ్యాచ్​ల్లో ఒకటి అని రోజర్ ఫెదరర్​ తెలిపాడు. అతడితో ఆటను ఎప్పుడూ ఆస్వాదిస్తానని మ్యాచ్​ అనంతరం చెప్పాడు. శుక్రవారం హోరాహోరీగా సాగిన సెమీస్​లో రఫాపై 7-6, 1-6, 6-3, 6-4 తేడాతో విజయం సాధించాడు స్విస్ దిగ్గజం.

రఫెల్ నాదల్

"రఫాతో ఆడటాన్ని ఎప్పుడూ ఆస్వాదిస్తా. నాకిష్టమైన మ్యాచ్​ల్లో ఈ మ్యాచ్​ ఒకటిగా మిగిలిపోతుంది. ఎందుకంటే అక్కడుంది రఫెల్​ నాదల్" -రోజర్ ఫెదరర్​, స్విట్జర్లాండ్ ఆటగాడు.

జకోవిచ్​తో జరగనున్న తుదిపోరు రసవత్తరంగా సాగనుందని జోస్యం చెప్పాడు ఫెదరర్​.

జకోవిచ్

"నొవాక్ డిఫెండింగ్ ఛాంపియన్. అతడితో మ్యాచ్ కొంచెం కష్టమైనా... ఓడించడానికి ప్రయత్నిస్తాను. మ్యాచ్​ రసవత్తరంగా సాగనుంది" -రోజర్ ఫెదరర్​, స్విట్జర్లాండ్ ఆటగాడు.

మరో సెమీస్​లో బటిస్టా అగట్​ను ఓడించి ఆరోసారి వింబుల్డన్ పైనల్​కు చేరాడు జకోవిచ్.

ఆదివారం వీరిద్దరి మధ్య జరగనున్న ఫైనల్లో గెలిచి 21వ గ్రాండ్​స్లామ్​ను సొంతం చేసుకోవాలనుకుంటున్నాడు రోజర్. అలాగే కెరీర్​లో 16వ టైటిల్ నెగ్గాలని ఉర్రూతలూగుతున్నాడు జకోవిచ్.

అత్యధిక వయసులో(38) గ్రాండ్​స్లామ్​ ఫైనల్​ చేరిన మూడో వ్యక్తిగా రోజర్ రికార్డు సృష్టించాడు. 1974లో కెన్ రోస్​వెల్ 39 ఏళ్ల వయసులో వింబుల్డన్, యూఎస్ ఓపెన్ ఫైనల్​కు చేరాడు.

ఇది చదవండి: 24వ టైటిల్ కోసం ఒకరు.. బోణీ​ కోసం మరొకరు

ABOUT THE AUTHOR

...view details