కరోనా భయంతో యుఎస్ ఓపెన్ నుంచి ఒక్కొక్కరుగా క్రీడాకారులు తప్పుకుంటున్నారు. ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా) మాత్రం తాను ఈ టోర్నీ ఆడి తీరతానని మరోసారి స్పష్టం చేశాడు. ఆగస్టు 31న నుంచి పోటీలు ఆరంభం కానున్నాయి. "ప్రస్తుత పరిస్థితుల్లో న్యూయార్క్ వచ్చి ఆడాలని తీసుకున్న నిర్ణయం కఠినమైందే. ఎందుకంటే నాతో పాటు మా బృందం ఎన్నో అడ్డంకులను అధిగమించాల్సి ఉంటుంది" అని జకో చెప్పాడు.
యూఎస్ ఓపెన్‌లో ఆడి తీరతా: జకోవిచ్ - Novak Djokovic latest tournament updates
యూఎస్ ఓపెన్‌లో ఎలాగైనా సరే ఆడతానని ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ నావొక్ జకోవిచ్ చెప్పాడు. ఇప్పటికే కరోనా భయంతో చాలా మంది ఆటగాళ్లు ఈ టోర్నీ నుంచి విరమించుకుంటున్నారు.
Novak Djokovic to compete in US Open
జకోవిచ్‌తో పాటు అతడి భార్య, కోచ్ ఇవానిసెవిచ్‌లు ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నారు. స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్, కిర్గియోస్, మహిళల ప్రపంచ నంబర్‌వన్ ఆష్లె బార్టీ లాంటి స్టార్లు ఇప్పటికే ఈ గ్రాండ్‌స్లామ్ నుంచి వైదొలిగారు. అభిమానులు లేకుండానే ఈసారి పోటీలను నిర్వహించనున్నారు. ఈ టోర్నీకి ముందు వెస్ట్రన్ అండ్ సదరన్ ఓపెన్ జరగనుంది.