ఆడ్రియా టోర్నీ నిర్వహించినందుకు తాను పశ్చాత్తాపం చెందుతున్నట్లు చెప్పాడు స్టార్ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్. బాల్కన్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో పాల్గొన్న పలువురు క్రీడాకారులతో పాటు జకోవిచ్ కూడా కరోనా బారిన పడ్డారు. తనతో పాటు నిర్వహకులు దీనిని నిర్వహించడంలో విఫలమయ్యారని చెబుతూ క్షమాపణలు కోరుతూ ట్వీట్ చేశాడు.
"మీ అందరికీ ఇబ్బంది పెట్టినందుకు క్షమాపణలు కోరుతున్నాను. నేను, మా నిర్వహకులు స్వచ్ఛమైన మనసుతోనే ఈ ఎగ్జిబిషన్ టోర్నీని నిర్వహించాం. అన్ని రకాల జాగ్రత్తలు పాటించాం. కానీ అనూహ్య రీతిలో మా వల్ల పొరపాటు జరిగిపోయింది. మీకు ఎలా క్షమాపణలు చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. దయచేసి ఈ టోర్నీకి హాజరైనవారంతా కొవిడ్-19 నిర్ధరణ పరీక్షలు చేయించుకోండి. భౌతిక దూరం పాటించండి"