తెలంగాణ

telangana

ETV Bharat / sports

US Open 2021: ఫైనల్​కు జకో.. ఆల్​టైమ్ రికార్డుకు అడుగు దూరంలో - యూఎస్ ఓపెన్ 2021

ప్రపంచ నంబర్ వన్​ టెన్నిస్ ఆటగాడు నొవాక్​ జకోవిచ్​ ఆల్​టైమ్​ రికార్డుకు అడుగు దూరంలో ఉన్నాడు. యూఎస్​ ఓపెన్​లో(US Open 2021) భాగంగా శనివారం జరిగిన సెమీస్​లో జ్వెరెవ్​పై విజయం సాధించి ఫైనల్​కు దూసుకెళ్లాడు.

djokovic
జకోవిచ్

By

Published : Sep 11, 2021, 9:24 AM IST

Updated : Sep 11, 2021, 10:02 AM IST

యూఎస్​ ఓపెన్​లో (US Open Tennis) టాప్​సీడ్​ జకోవిచ్​ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. శనివారం జరిగిన పోటీల్లో గెలిచి ఫైనల్​కు దూసుకెళ్లాడు. పురుషుల సింగిల్స్​ సెమీస్​లో 4-6, 6-2, 6-4,6-2 తేడాతో నాలుగో సీడ్ జర్మన్​ ఆటగాడు అలెగ్జాండర్​ జ్వెరెవ్​పై(Djokovic vs Zverev) విజయం సాధించాడు.

ఆదివారం(సెప్టెంబరు 12) రెండో సీడ్​ ఆటగాడు డానిల్ మెద్వెదెవ్(జర్మనీ)తో(Medvedev vs Djokovic) ఫైనల్​లో పోటీ పడనున్నాడు జకోవిచ్. ఆర్థర్ ఆషే స్టేడియంలో ఈ ఛాంపియన్​ షిప్​ మ్యాచ్​ జరగనుంది.

అత్యధిక టైటిళ్లు

ఈ టైటిల్​ గెలిస్తే.. అత్యధిక గ్రాండ్​స్లామ్​ టైటిళ్లు సొంతం చేసుకున్న టెన్నిస్​ ఆటగాడిగా జకోవిచ్(Novac Djokovic News)​ చరిత్ర సృష్టించినట్లవుతుంది. దీంతో పాటు 52 ఏళ్ల తర్వాత పురుషుల సింగిల్స్​ క్యాలెండర్ ఇయర్​ గ్రాండ్స్​ స్లామ్​ గెలిచిన ఆటగాడిగా నిలువనున్నాడు ఈ ప్రపంచ నంబర్​వన్ ఆటగాడు. గతంలో 1969లో రాడ్ లావెర్ క్యాలెండర్​ ఇయర్ గ్రాండ్​ స్లామ్స్​ గెలిచి రికార్డు సృష్టించాడు.

ఇదీ చదవండి:US Open 2021: సెరెనా తర్వాత ఆ రికార్డు నెలకొల్పిన ఎమ్మా

Last Updated : Sep 11, 2021, 10:02 AM IST

ABOUT THE AUTHOR

...view details