టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్, అతడి భార్య.. ప్రాణాంతక కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా చేసిన వైరస్ నిర్థరణ పరీక్షల్లో వారికి నెగిటివ్ వచ్చింది. వైరస్ సోకిందని తేలిన తర్వాత వీరిద్దరూ పదిరోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉన్నారు.
ఇటీవలే బాల్కాన్లో జకోవిచ్ ఆధ్వర్యంలో ఆడ్రియా టెన్నిస్ టోర్నీ జరిగింది. ఇందులో పాల్గొన్న ప్రముఖ టెన్నిస్ క్రీడాకారులు విక్టర్, అతడి భార్య, ద్రిమితోవ్, బోర్నా కోరిక్, జకోవిచ్, అతని భార్యకు కరోనా సోకింది. దీంతో వీరందరూ క్వారంటైన్లోకి ఉన్నారు.