ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్స్‌లో ఐదో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)పై గెలుపొందాడు సెర్బియా ఆటగాడు జకోవిచ్. గురువారం జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ నంబర్‌వన్ జకోవిచ్ 7-5, 6-2, 6-2 తేడాతో అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)పై విజయం సాధించాడు. తొలి సెట్లో ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదుర్కొన్న జకో.. తర్వాతి రెండు సెట్లలో సునాయాసంగా గెలిచాడు.
ఫ్రెంచ్ ఓపెన్: సెమీస్‌లో జకో వర్సెస్ థీమ్ - Roland-Garros 2019
ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో నొవాక్ జకోవిచ్(సెర్బియా) జోరు కొనసాగుతోంది. కెరీర్లో మరో గ్రాండ్‌స్లామ్ లక్ష్యంగా బరిలో దిగిన అతడు ఈ టోర్నీ సెమీస్‌లో అడుగుపెట్టాడు. ఆస్ట్రియా క్రీడాకారుడు థీమ్‌తో తదుపరి మ్యాచ్‌లో తలపడనున్నాడు.
![ఫ్రెంచ్ ఓపెన్: సెమీస్‌లో జకో వర్సెస్ థీమ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3492553-57-3492553-1559873522012.jpg)
ఫ్రెంచ్ ఓపెన్: సెమీస్‌లో జకో.. థీమ్‌తో పోరుకు సై
మరో క్వార్టర్స్‌లో నాలుగో సీడ్ డోమినిక్ థీమ్ (ఆస్రేలియా) 6-2, 6-4, 6-2తో కచనోవ్ (రష్యా)పై నెగ్గి తుది నాలుగు జాబితాలో చోటు దక్కించుకున్నాడు. మ్యాచ్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన థీమ్ వరుస సెట్లలో ప్రత్యర్థిని చిత్తుచేశాడు. మూడు ఏస్‌లు సంధించిన థీమ్.. ఐదుసార్లు ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేశాడు.
సెమీఫైనల్స్‌లో రఫెల్ నదాల్(స్పెయిన్)తో ఫెదరర్(స్విట్జర్లాండ్), జకోవిచ్‌తో థీమ్ తలపడనున్నారు.