రోజురోజుకు కొవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్ నిర్వహణలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది టెన్నిస్ స్టార్ నవోమి ఒసాకా. ఆటల నిర్వహణ వల్ల కలిగే నష్టాల గురించి విస్తృతమైన చర్చ అవసరమని ఆమె పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒలింపిక్స్ అవసరమా అనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేసింది.
"ఒలింపిక్స్ జరగాలని నేను కోరుకుంటున్నాను. కరోనా నేపథ్యంలో గత సంవత్సర కాలంగా చాలా మార్పులు జరిగాయి. ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొవిడ్.. ప్రజలను అసౌకర్యానికి గురిచేస్తుంది. ఒలింపిక్స్ నిర్వహణ వల్ల ప్రజా జీవితం ప్రమాదంలో పడుతుందని నేను భావిస్తున్నాను. కాబట్టి దీనిపై చర్చ అవసరం."
-నవోమి ఒసాకా, టెన్నిస్ క్రీడాకారిణి.