భారత టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నగల్.. ఫ్రెంచ్ ఓపెన్(FRENCH OPEN) మొయిన్ డ్రా కు అర్హత సాధించలేకపోయాడు. పారిస్‌లో జరుగుతున్న క్వాలిఫయింగ్ పోటీల్లోని ఓడిపోయాడు. రెండో రౌండ్లో అలేజేండ్రో తబిలో(చిలీ) చేతిలో వరుస సెట్లలో 3-6, 3-6 తేడాతో ఓటమిపాలయ్యాడు. రామ్‌కుమార్ రామ్‌నాథన్, ప్రజ్ఞేశ్ , అంకిత రానా ఇప్పటికే ఈ పోటీల నుంచి నిష్క్రమించారు.
FRENCH OPEN: సుమిత్ నగల్‌కు తప్పని నిరాశ - టెన్నిస్ లేటేస్ట్ న్యూస్
ఈసారి ఫ్రెంచ్ ఓపెన్ బరిలో నిలవాలనుకున్న భారత్ సింగిల్స్ ప్లేయర్లు.. దానిని సాధించలేకపోయారు. గురువారం జరిగిన పోరులో సుమిత్ నగల్ ఓడిపోయి, అర్హత పోటీల నుంచి వైదొలిగాడు.
సుమిత్ నగల్
ఫ్రెంచ్ ఓపెన్(FRENCH OPEN)లో పురుషుల డబుల్స్ మెయిన్ డ్రా కు రోహన్ బోపన్న-దివిజ్ శరణ్ మాత్రమే అర్హత సాధించారు. ఈ టోర్నీలో సానియా మీర్జా(Sania mirza) పాల్గొనట్లేదు. తన స్పెషల్ ర్యాంకింగ్‌తో వింబుల్డన్(wimbledon) ఛాంపియన్షిప్ ఆడాలని ఆమె భావిస్తోంది.
ఇది చదవండి:టెన్నిస్‌లో రాణిస్తున్న రష్మిక.. గ్రాండ్స్లామే లక్ష్యం