పారిస్ మాస్టర్స్ టోర్నీకి స్పెయిన్బుల్ రఫెల్ నాదల్ దూరమయ్యాడు. పొత్తి కడుపు గాయం బారిన పడిన రఫా ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఈ కారణంగా ఇప్పటికే నెలరోజులు టెన్నిస్ కోర్టుకు దూరమయ్యాడు స్పెయిన్ బుల్.
"2009 యూఎస్ ఓపెన్ నుంచే నేను ఈ గాయంతో బాధపడుతున్నా. ఇప్పుడు ఇది మరింత తీవ్రరూపం దాల్చింది. డెవిస్ కప్ సెమీస్ కూడా ఆడలేనేమో. టెన్నిస్ కోర్టులో అడుగుపెట్టి నెలరోజులైంది." - రఫెల్ నాదల్, స్పెయిన్ టెన్నిస్ స్టార్