తెలంగాణ

telangana

ETV Bharat / sports

బాల్​గర్ల్​ను ముద్దాడిన టెన్నిస్​ స్టార్​ నాదల్​ - Argentine Federico Delbonis

ఆస్ట్రేలియన్ ఓపెన్​లో గురువారం ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. నాదల్ కొట్టిన బంతి బాల్​గర్ల్​ను తాకగా.. ఆమెను ఆయన పరామర్శించిన తీరు అందర్ని ఎంతగానో ఆకట్టుకుంది.

Nadal shows caring side with kiss for blushing ballgirl
బాల్​గర్ల్​ను ముద్దాడి పరామర్శించిన టెన్నిస్​స్టార్​ నాదల్​

By

Published : Jan 24, 2020, 6:32 AM IST

Updated : Feb 18, 2020, 4:58 AM IST

ఆస్ట్రేలియన్​ ఓపెన్​ టోర్నీలో గురువారం జరిగిన ఓ సంఘటన నెట్టింట వైరల్​ అయింది. టెన్నిస్​ మైదానంలో రఫెల్​ నాదల్​ ఆడిన షాట్​కు బంతి బాల్​గర్ల్​కు తగిలింది. వెంటనే నాదల్​.. బాలికను ఓదార్చిన తీరు అందర్ని కట్టి పడేసింది.

బాల్​గర్ల్​ను ముద్దాడి పరామర్శించిన టెన్నిస్​స్టార్​ నాదల్​

"నేను కొట్టిన బంతి బలంగా ఆమెను తాకింది. అప్పుడు తనకేమైనా అయ్యిందేమో అని భయపడ్డాను. ఏమి కాలేదని ఆమె నవ్వుతూ సమాధానమిచ్చింది. ఆ క్షణం నాకేంతో సంతోషం కలిగింది. ఆమె చాలా ధైర్యవంతురాలు. నా కెరీర్​లో జరిగిన భయానక సంఘటనల్లో ఇది ఒకటి."
- రఫెల్​ నాదల్​, టెన్నిస్​ క్రీడాకారుడు

ప్రత్యర్ధి అర్జంటైన్​ ఫెదరికో పై ఆడుతున్న మ్యాచ్​లో రెండో రౌండ్​ ముగించే సమయంలో ఈ సంఘటన జరిగింది. మ్యాచ్​ ముగిసిన తర్వాత అతని తలకున్న బ్యాండ్​ను ఆమెకు బహుకరించాడు.

ఇదీ చూడండి.. రెండు సార్లు సెమీస్​లో ఓడాం.. ఈ సారి ప్రపంచకప్​ పక్కా!

Last Updated : Feb 18, 2020, 4:58 AM IST

ABOUT THE AUTHOR

...view details