స్పెయిన్ దిగ్గజం రఫెల్ నాదల్.. ఇటాలియన్ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ నాదల్ 6-3, 6-4తో ఆరో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)పై విజయం సాధించాడు. గత వారం మాడ్రిడ్ ఓపెన్ క్వార్టర్స్‌లో జ్వెరెవ్ చేతిలో ఓడిన రఫా.. ఈసారి అతడికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు.
ఇటాలియన్ ఓపెన్ సెమీస్‌లో నాదల్ - రఫెల్ నాదల్
ఇటాలియన్ ఓపెన్ సెమీస్‌లోకి స్టార్ టెన్నిస్ ప్లేయర్ రఫెల్ నాదల్ ప్రవేశించాడు. క్వార్టర్ ఫైనల్లో అలెగ్జాండర్ జ్వెరెవ్‌పై 6-3, 6-4 తేడాతో విజయం సాధించాడు.
రికార్డు స్థాయిలో తొమ్మిదిసార్లు ఇటాలియన్ ఓపెన్ గెలిచిన రఫా.. సెమీస్‌లో ఒపెల్కా (అమెరికా)తో తలపడనున్నాడు. మరో పోరులో ఒపెల్కా 7-5, 7-6 (7/2)తో డెల్‌బోనిస్ (అర్జెంటీనా)ను ఓడించాడు. మహిళల సింగిల్స్‌లో ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్), కొకోగాఫ్ (అమెరికా) సెమీఫైనల్ చేరారు. క్వార్టర్స్‌లో ప్లిస్కోవా 4-6, 7-5, 7-6 (7/1)తో ఒస్టాపెంకో (లాత్వియా)ను ఓడించింది. కోకో గాఫ్‌తో మ్యాచ్‌లో టాప్‌సీడ్ బార్టీ 6-4, 2-1తో ఆధిక్యంలో ఉన్న దశలో గాయం కారణంగా వైదొలిగింది.
ఇదీ చదవండి:జట్టు కోసం ఏదైనా చేస్తా: హనుమ విహారి