తెలంగాణ

telangana

ETV Bharat / sports

సెమీస్​లో నాదల్ - ఫెదరర్​, జకో - బటిస్టా ఢీ

వింబుల్డన్ సెమీస్​లో నాదల్​తో తలపడనున్నాడు ఫెదరర్​. మరో సెమీస్​లో స్పానిష్ ఆటగాడు బటిస్టా అగట్​ను ఢీ కొట్టనున్నాడు జకోవిచ్. జులై 12న ఈ సెమీస్​ మ్యాచ్​లు జరగనున్నాయి.

ఫెదరర్​ - నాదల్

By

Published : Jul 11, 2019, 7:46 AM IST

వింబుల్డన్ సెమీస్​ మ్యాచ్​లో చిరకాల ప్రత్యర్ధులు మరోసారి తలపడనున్నారు. పురుషుల సింగిల్స్ విభాగంలో రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్ పోటీపడనున్నారు. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఫెదరర్ జపాన్​కు చెందిన నిషికోరిని ఓడించగా.. అమెరికా క్రీడాకారుడు సామ్ క్వారేను మట్టికరిపించాడు నాదల్.

100వ వింబుల్డన్ మ్యాచ్ ఆడిన ఫెదరర్ 4-6, 6-1, 6-4, 6-4 తేడాతో నిషికోరిపై గెలిచాడు. ఈ ప్రాచీన టోర్నీలో 13వ సారి సెమీస్​లోకి అడుగుపెట్టాడు స్విస్ దిగ్గజం.

సామ్ క్వారేపై 7-5, 6-2, 6-2 తేడాతో నెగ్గాడు రఫా. ఆరంభం నుంచి ధాటిగా ఆడిన నాదల్ ప్రత్యర్థికి మొత్తం 22 ఏస్​లు సంధించి అయోమయంలో పడేశాడు.

మరో సెమీస్​లో స్పానిష్ క్రీడాకారుడు బటిస్టా అగట్​ను ఢీ కొట్టనున్నాడు జకోవిచ్. క్వార్టర్స్​లో​ బల్గేరియా ఆటగాడు గాఫిన్​ను ఓడించి సెమీస్​కు దూసుకొచ్చాడు జకో.
జులై 12న లండన్ వేదికగా సెమీస్​ మ్యాచ్​లు జరగనున్నాయి.

ABOUT THE AUTHOR

...view details