క్వార్టర్స్‌లో నాదల్,ఫెదరర్ - ఫెదరర్
ఇండియన్ వెల్స్ ఏటీపీ టెన్నిస్ టోర్నీలో దిగ్గజాలు రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్ పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు.
క్వార్టర్స్‌లో నాదల్,ఫెదరర్
స్విస్ లెజెండ్ రోజర్ ఫెదరర్ ఆరోసారి టైటిల్ సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు. నాలుగో సీడ్‌గా ఉన్న ఫెదరర్ (స్విట్జర్లాండ్) 6–1, 6–4తో కైల్ ఎడ్మండ్ (బ్రిటన్)పై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు.
- మరో దిగ్గజం స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ సైతం క్వార్టర్స్ చేరాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 2వ స్థానంలో కొనసాగుతోన్న ఆ ఆటగాడు...6–3, 6–4తో సెర్బియన్ ఆటగాడు ఫిలిప్ క్రాజినొవిక్‌ను ఓడించాడు. నాలుగోసారి టైటిల్ గెలవాలని పట్టుదలతో ఉన్నాడు నాదల్.
- ఇద్దరు క్వార్టర్స్‌లో గెలిస్తే సెమీస్‌లో ముఖాముఖీ తలపడనున్నారు.
- నేటి క్వార్టర్ ఫైనల్లో నాదల్ ప్రపంచ 13వ ర్యాంకర్ కరెన్ ఖచనోవ్ (రష్యా)ను ఢీ కొడుతున్నాడు. హుబెర్ట్ హర్కజ్ (పొలండ్)తో ఫెదరర్ పోటీకి సిద్ధమవుతున్నాడు.