తెలంగాణ

telangana

ETV Bharat / sports

వింబుల్డన్​లో ఆండీ ముర్రే, సెరెనా జోడీ - సెరెనా విలియమ్స్

ప్రముఖ టెన్నిస్​ క్రీడాకారులు ఆండీ ముర్రే, సెరెనా విలియమ్స్​ వింబుల్డన్​ మిక్స్​డ్​ డబుల్స్​లో కలిసి ఆడనున్నారు. సెరెనా లాంటి గొప్ప క్రీడాకారిణితో కలిసి ఆడే అవకాశం జీవితంలో ఒక్కసారే వస్తుందని... అందుకే ఈ అవకాశాన్ని వదులుకోదల్చుకోలేదని అన్నాడు ఆండీ.

పచ్చిక మైదానంలో జోడిగా ముర్రే, సెరెనా

By

Published : Jul 4, 2019, 10:40 AM IST

బ్రిటన్​ టెన్నిస్​ ఆటగాడు ఆండీ ముర్రే... అమెరికా స్టార్​ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్​తో కలిసి వింబుల్డన్​ సమరంలో దిగనున్నాడు. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న పచ్చిక మైదాన ఈవెంట్​లో మిక్స్​డ్​ డబుల్స్​లో ఈ ఇద్దరు కలిసి ఆడనున్నారు. ఇదే విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించింది ముర్రే యాజమాన్యం.

సెరెనా లాంటి గొప్ప క్రీడాకారిణితో కలిసి ఆడే అవకాశం జీవితంలో ఒక్కసారే వస్తుందని... అందుకే ఈ అవకాశాన్ని వదులుకోదల్చుకోలేదని అన్నాడు ఆండీ.

"కోర్టులో మేమిద్దం ఒకేలా ఉంటాం... నాకు ముర్రేలో నచ్చే విషయం అదే" అని సెరెనా చెప్పింది.

ఈ ఇద్దరి ఖాతాలో ఇప్పటి వరకు 26 గ్రాండ్​స్లామ్​లు ఉన్నాయి. జులై 1న ప్రారంభమైన ఈ టోర్నీ ఈ నెల 14న ముగియనుంది.

ABOUT THE AUTHOR

...view details