తెలంగాణ

telangana

ETV Bharat / sports

యూఎస్​ ఓపెన్​: స్పెయిన్​ స్టార్​ ముగురుజ ముందంజ - ముగురుజ యూఎస్​ ఓపెన్

యుఎస్‌ ఓపెన్ టైటిల్‌ ఫేవరెట్లు జకోవిచ్‌, ఒసాకాతో పాటు స్పెయిన్‌ స్టార్‌ ముగురుజ కూడా రెండో రౌండ@kg‌ చేరింది. అమెరికా టీనేజర్‌ కోకోగాఫ్‌ తొలి రౌండ్లో నిష్క్రమించడం ఒక్కటే ఇప్పటిదాకా పెద్ద సంచలనం.

Muguruza shakes off rust to reach US Open second round
యూఎస్​ ఓపెన్​: స్పెయిన్​ టెన్నిస్​ స్టార్​ ముగురుజ ముందంజ

By

Published : Sep 2, 2020, 6:41 AM IST

స్పెయిన్‌ తార ముగురుజ యుఎస్‌ ఓపెన్లో శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో ఈ పదో సీడ్‌ 6-4, 6-4తో హిబినో (జపాన్‌)ను వరుస సెట్లలో ఓడించింది. ఈ పోరులో మూడుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసిన ముగురుజ 22 విన్నర్లు కొట్టింది. మెర్టిన్స్‌ (బెల్జియం), అనిసిమోవా (అమెరికా), పిరంకోవా (బల్గేరియా) కూడా తొలి రౌండ్‌ దాటారు. మెర్టిన్స్‌ 6-2, 6-2తో సిగ్మండ్‌ (జర్మనీ)పై గెలవగా, అనిసిమోవా 7-5, 7-5తో తొమోవా (బల్గేరియా)పై, పిరంకోవా 6-2, 6-3తో సంసోనోవా (రష్యా)పై నెగ్గారు. మరోవైపు 16 ఏళ్ల అమెరికా తార కోకోగాఫ్‌ ఆరంభ రౌండ్లోనే నిష్క్రమించింది. ఆమె 3-6, 7-5, 4-6తో సెవాస్సోవా (లాత్వియా) చేతిలో కంగుతింది. 13 డబుల్‌ ఫాల్ట్స్‌తో పాటు 41 అనవసర తప్పిదాలు చేసిన గాఫ్‌ ఓటమిని కొని తెచ్చుకుంది. గత నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో తొలి రౌండ్లోనే ఓడిపోవడం కోకోకు ఇదే తొలిసారి. టైటిల్‌ ఫేవరెట్‌ ఒసాకా (జపాన్‌) ముందంజ వేసింది. తొలి రౌండ్లో నాలుగో సీడ్‌ 6-2, 5-7, 6-2తో మిసాకి (జపాన్‌)పై గెలిచింది.

జకో సులభంగా..

సెర్బియా స్టార్‌ నొవాక్‌ జకోవిచ్‌ శుభారంభం చేశాడు. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో టాప్‌సీడ్‌ జకో 6-1, 6-4, 6-1తో జుమ్‌హర్‌ (బోస్నియా)ను ఓడించాడు. ఈ పోరులో రెండో సెట్లో తప్ప.. ప్రత్యర్థి నుంచి నొవాక్‌కు పెద్దగా ప్రతిఘటన ఎదురు కాలేదు. జ్వెరెవ్‌ (జర్మనీ), సిట్సిపాస్‌ (గ్రీస్‌), షపలోవ్‌ (కెనడా), గోఫిన్‌ (బెల్జియం) తొలి రౌండ్‌ దాటారు. అయిదో సీడ్‌ జ్వెరెవ్‌ 7-6 (7/2), 5-7, 6-3, 7-5తో అండర్సన్‌ (దక్షిణాఫ్రికా)ను ఓడించగా, పన్నెండోసీడ్‌ షపలోవ్‌ 6-4, 4-6, 6-3, 6-2తో కొర్డా (అమెరికా)పై గెలిచాడు. నాలుగోసీడ్‌ సిట్సిపాస్‌ 6-2, 6-1, 6-1తో రమోస్‌ వినోలాస్‌ (స్పెయిన్‌)ను చిత్తు చేయగా.. ఏడో సీడ్‌ గోఫిన్‌ (బెల్జియం) 7-6 (7/2), 3-6, 6-1, 6-4తో ఒప్లెకా (అమెరికా)పై కాస్త కష్టపడి గెలిచాడు. సుదీర్ఘంగా సాగిన మ్యాచ్‌ల్లో జాన్‌ ఇస్నర్‌ (అమెరికా) 7-6 (7/5), 3-6, 7-6 (7/5), 3-6, 6-7 (3/7)తో జాన్సన్‌ (అమెరికా) చేతిలో, తొమ్మిదో సడ్‌ స్క్వార్జ్‌మాన్‌ (అర్జెంటీనా) 6-3, 6-4, 2-6, 1-6, 5-7తో నోరీ (బ్రిటన్‌) చేతిలో ఓడిపోయారు.

సుమిత్​ నగాల్​

రెండో రౌండ్లో నగాల్‌

యుఎస్‌ ఓపెన్లో భారత ఆటగాడు సుమిత్‌ నగాల్‌ శుభారంభం చేశాడు. మంగళవారం తొలి రౌండ్లో నగాల్‌ 6-1, 6-3, 3-6, 6-1తో బ్లాడ్లి క్లాన్‌ (అమెరికా)పై అలవోకగా విజయం సాధించాడు. గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో నగాల్‌ రెండో రౌండ్‌కు చేరడం ఇదే తొలిసారి.

ABOUT THE AUTHOR

...view details