భారత టెన్నిస్ దిగ్గజం, డేవిస్ కప్ మాజీ కోచ్ అక్తర్ అలీ(83) కన్నుమూశారు. ప్రొస్టేట్ క్యాన్సర్ సహా పలు అనారోగ్య సమస్యలతో ఆయన మృతి చెందారు. పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న అక్తర్ అలీని.. రెండు వారాల క్రితం కోల్‌కతాలోని ఓ ఆసుపత్రిలో చేర్పించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రస్తుత డేవిస్ కప్ కోచ్ జీషన్ అలీ ఈయన కుమారుడే.
జీషన్ అలీ, విజయ్ అమృత్‌రాజ్, రమేశ్ కృష్ణన్ సహా చాలా మంది ఈ దిగ్గజ టెన్నిస్ దిగ్గజ్ కోచింగ్ వల్ల ప్రభావితమయ్యారు.