లారస్ ప్రపంచ స్పోర్ట్స్ డిజిటల్ అవార్డుల కార్యక్రమం స్పెయిన్ సెవిల్లే వేదికగా జరిగింది. 2021కి గానూ 'స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్' అవార్డును.. ప్రపంచ టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్ గెలుచుకున్నాడు. 'స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్' అవార్డును మహిళ టెన్నిస్ క్రీడాకారిణి నవోమి ఒసాకా కైవసం చేసుకుంది.
మరికొన్ని అవార్డులు..
- వరల్డ్ టీమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు- బేయర్న్ మ్యూనిచ్ ఫుట్‌బాల్ టీమ్
- ది అథ్లెట్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్- లూయిస్ హామిల్టన్, ఫార్ములా వన్ ఛాంపియన్
- స్పోర్టింగ్ ఇన్స్పిరేషన్ అవార్డు- ఎంఓ సాలా, లివర్‌పూల్ ఫుట్‌బాల్ ఆటగాడు
- లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు- బిల్లీ జీన్ కింగ్