కరోనా మహమ్మారి ప్రభావంతో యుఎస్ ఓపెన్ నుంచి మరో స్టార్ క్రీడాకారిణి వైదొలిగింది. 2004 యుఎస్ ఓపెన్ ఛాంపియన్ స్వెత్లానా కుజ్నెత్సొవా (రష్యా) ఈ టోర్నీకి దూరమవుతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించింది.
యుఎస్ ఓపెన్‌కు కజ్నెత్సొవా దూరం
టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కరోనా భయంతో ఇప్పటికే ఈ మెగాటోర్నీ నుంచి టాప్ ప్లేయర్లు తప్పుకున్నారు. తాజాగా మాజీ ఛాంపియన్ కుజ్నెత్సొవా అదే జాబితాలో చేరింది.
"యుఎస్ ఓపెన్ నుంచి తప్పుకుంటున్నందుకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఈ టోర్నీలో ఆడేందుకు చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నా. కరోనా నా ప్రణాళికలన్నింటిని దెబ్బ కొట్టింది" అని కుజ్నెత్సొవా చెప్పింది.
2009లో ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన ఈ రష్యా తార.. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమంగా రెండో స్థానానికి చేరింది. ప్రస్తుతం ఆమె 35వ ర్యాంకులో ఉంది. ఇప్పటికే ప్రపంచ నంబర్ వన్ ఆష్లే బార్టీతో పాటు రఫెల్ నాదల్, వావ్రింకా, కిర్గియోస్, స్వితోలినా, బెర్టిన్స్ లాంటి స్టార్లు ఈ గ్రాండ్‌స్లామ్ టోర్నీకి దూరమయ్యారు. ఆగస్టు 31 నుంచి యుఎస్ ఓపెన్ ఆరంభం కానుంది.