ఇటలీ యువ టెన్నిస్ ప్లేయర్ జన్నిక్ సిన్నర్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. 12 ఏళ్ల వయసున్న ఈ ఆటగాడు.. బల్గేరియా వేదికగా జరిగిన సోఫియా ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో కెనడా ఆటగాడు వసెక్ పాస్పిసిల్పై 6-4, 3-6, 7-6(3) తేడాతో గెలుపొందాడు. అయితే ఈ విజయం అనంతరం ఏటీపీ టూర్ టైటిల్‌ను గెలిచిన అతిపిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు.
12 ఏళ్ల జన్నిక్ సంచలనం- తొలి ఏటీపీ టైటిల్ కైవసం - Jannik Sinner 12 years to win ATP title
ఇటలీ యువ టెన్నిస్ సంచలనం జన్నిక్ సిన్నర్ అరుదైన ఘనత సాధించాడు. 12 ఏళ్ల వయసులోనే ఏటీపీ టైటిల్ కైవసం చేసుకొని చరిత్ర సృష్టించాడు. ఫలితంగా ఇప్పటివరకు జపాన్‌కు చెందిన నిషికొరి పేరిట ఉన్న రికార్డు బ్రేక్ అయింది.
జన్నిక్ సినర్ సంచలనం.. 12ఏళ్ల వయసులోనే ఏటీపీ టైటిల్ కైవసం
ఇప్పటివరకు ఈ రికార్డు జపాన్‌కు చెందిన కీ నిషికొరి పేరిట ఉండేది. ఇతడు 18 ఏళ్ల వయసులో డెల్రే బీచ్ ఓపెన్ కైవసం చేసుకున్నాడు. ఈ ఘనత 2008లో నమోదైంది. అయితే 12 ఏళ్లకు నిషికొరి రికార్డును బ్రేక్ చేశాడు జన్నిక్.
తొలి ప్రయత్నంలోనే సోఫియా ఓపెన్ సాధించిన జన్నిక్ సిన్నర్.. ఈ ఫీట్ అందుకున్న ఆరో ప్లేయర్‌గా ఘనత సాధించాడు. గతంలో ఉగో హంబెర్ట్, కాస్పర్ రుడ్, తైగో సేబోత్, మియోమిర్ కెక్నోవిక్, జాన్ మిల్మాన్ ఈ జాబితాలో ముందున్నారు.