లండన్‌లో జరుగుతున్న ఏటీపీ పోటీల్లో మెద్వెదేవ్, డొమినిక్ థీమ్ ఫైనల్స్ చేరారు. శనివారం జరిగిన సెమీస్‌లో తొలుత డొమినిక్ 7-5, 6-7 (10/12), 7-6 (7/5) తేడాతో జకోవిచ్‌ను ఓడించగా తర్వాత మెద్వెదేవ్ 3-6, 7-6 (4), 6-3 తేడాతో రఫెల్ నాదల్‌ను దెబ్బకొట్టాడు. దీంతో ఇద్దరు దిగ్గజాలు సెమీస్ నుంచే ఇంటిముఖం పట్టారు.
ఏటీపీ టోర్నీలో నాదల్ ఓటమి.. ఫైనల్లో కుర్రాళ్లు - nadal news
ఏటీపీ టెన్నిస్ టోర్నీలో స్టార్ ప్లేయర్లను ఓడించిన కుర్రాళ్లు మెద్వదేవ్, థీమ్ తుదిపోరుకు అర్హత సాధించారు. మరి ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి?
ఏటీపీ ఫైనల్
'టెన్నిస్ చరిత్రలో ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లను మేం ఓడించడం గర్వంగా ఉంది. ఈ ఆటలో ఇది ప్రత్యేకమైన సందర్భం' అని నాదల్‌ను ఓడించాక మెద్వెదేవ్ చెప్పాడు. ఈ మ్యాచ్ రెండో సెట్‌లో 5-4తో వెనుకబడిన తాను తర్వాత గేమ్‌లో స్వల్ప మార్పులు చేసుకున్నట్లు చెప్పాడు. అలా చేయడం వల్ల తనకు కలిసి వచ్చిందని, దాంతో నాదల్‌ను ఓడించానని మెద్వెదేవ్ తెలిపాడు.