తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇటాలియన్​ ఓపెన్ క్వార్టర్స్​లో జకోవిచ్​, నాదల్​ - ఇటాలియన్​ ఓపెన్​ రఫెల్​ నాదల్​

ఇటాలియన్​ ఓపెన్​ క్వార్టర్స్​లో స్టార్​ ఆటగాళ్లు నొవాక్​ జకోవిచ్​, రఫెల్​ నాదల్​ అడుగుపెట్టారు. ఈ టోర్నీలో మ్యాచ్​లకు 25 శాతం ప్రేక్షకులను మాత్రమే అనుమతిస్తున్నారు.

Italian Open
క్వార్టర్స్​కు జకోవిచ్​, నాదల్​

By

Published : May 13, 2021, 10:18 PM IST

ఇటాలియన్​ ఓపెన్​లో భాగంగా గురువారం జరిగిన ప్రీక్వార్టర్స్​లో టెన్నిస్​ దిగ్గజం నొవాక్ జకోవిచ్​ 6-2,6-1 తేడాతో స్పానిష్​ ఆటగాడు అలెజాండ్రో డేవిడొవిచ్​ను ఓడించాడు. ప్రారంభం నుంచే ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించిన ఈ ఛాంపియన్​.. తన అనుభవంతో సునాయసంగా గెలుపొందాడు.

ఈ మ్యాచ్​కు స్టేడియం సామర్థ్యంలో 25శాతం మంది ప్రేక్షకులకు అనుమతిచ్చారు. అభిమానులు మైదానంలో తిరిగి కనపడటంపై హర్షం వ్యక్తం చేశాడు జకోవిచ్​. క్వార్టర్​ ఫైనల్స్​లో స్టెఫానోస్‌ సిట్సిపాస్‌ లేదా బెర్రిట్టినితో తలపడనున్నాడు.

ప్రపంచ నెం.3 రఫెల్​ నాదల్​ 3-6,6-4,7-6(3) తేడాతో కెనడా ఆటగాడు డెనిస్​ షపోవలావ్​పై నెగ్గి క్వార్టర్​​కు చేరుకున్నాడు.

ఇదీ చూడండి: 'టోక్యో ఒలింపిక్స్​లో ఆడేది అనుమానమే!'

ABOUT THE AUTHOR

...view details