తెలంగాణ

telangana

ETV Bharat / sports

చైర్ అంపైర్​ ఆగ్రహానికి గురైన జకోవిక్

మరోసారి తన అసహనంతో చైర్ అంపైర్ ఆగ్రహానికి గురయ్యాడు టెన్నిస్ స్టార్ జకోవిక్. ఇటాలియన్ ఓపెన్​ క్వార్టర్స్​లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్​లో గెలిచిన జకో సెమీస్ చేరాడు.

Djokovic
చైర్ అంపైర్​ ఆగ్రహానికి గురైన జకోవిక్

By

Published : Sep 20, 2020, 9:25 AM IST

ఆటతో కాక నిర్లక్ష్యంతో యూఎస్‌ ఓపెన్‌ నుంచి నిష్క్రమించిన సెర్బియా స్టార్‌ నొవాక్‌ జకోవిక్ మరోసారి తన అసహనంతో చైర్‌ అంపైర్‌ హెచ్చరికలకు గురయ్యాడు. ఇటాలియన్‌ ఓపెన్లో ఈ ఘటన జరిగింది. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో 6-3, 4-6, 6-3తో జర్మనీ క్వాలిఫయర్‌ డొమినిక్‌ కొప్‌ఫర్‌పై కష్టపడి గెలిచి సెమీస్‌ చేరిన జకో.. మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయాడు.

జకోవిక్

రెండో సెట్లో తన సర్వీస్‌ బ్రేక్‌ అయి స్కోరు 3-3తో సమానంగా ఉన్నప్పుడు ఆగ్రహంతో ఊగిపోయిన నొవాక్‌.. రాకెట్‌ను నేలకేసి కొట్టి విరగ్గొట్టాడు. దీంతో అతనిని చైర్‌ అంపైర్‌ హెచ్చరించాడు. ఈ టోర్నీ ప్రిక్వార్టర్స్‌లోనూ జకో ఇలాగే ప్రవర్తించాడు. యూఎస్‌ ఓపెన్లో జకో నిర్లక్ష్యంగా బంతిని కొట్టడం వల్ల అది లైన్‌ అంపైర్‌కు తగిలింది. దీంతో జకోను టోర్నీ నుంచి తప్పించారు .

కాగా మహిళల సింగిల్స్‌లో సిమోనా హలెప్‌ సెమీఫైనల్లో ప్రవేశించింది. యులినా పుతిన్‌త్సెవా (కజకిస్థాన్‌)తో మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో 6-2, 2-0తో టాప్‌ సీడ్‌ సిమోనా ఆధిక్యంలో ఉన్న సమయంలో ప్రత్యర్థి గాయం కారణంగా తప్పుకోవడం వల్ల ఆమె ముందంజ వేసింది. పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో బోపన్న-డెన్నిస్‌ షపవ్‌లోవ్‌ (కెనడా) 6-4, 5-7, 7-10తో జెరెమీ చార్డీ-ఫాబ్రిస్‌ మార్టిన్‌ (ఫ్రాన్స్‌) చేతిలో పోరాడి ఓడారు.

ABOUT THE AUTHOR

...view details