ఇటలీ యువ టెన్నిస్ సంచలనం జన్నిక్ సిన్నర్ మరో రికార్డు సాధించాడు. ఫ్లోరిడా వేదికగా జరుగుతున్న మియామి ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఈ టోర్నీ ఫైనల్కు చేరిన నాలుగో పిన్న వయస్కుడు సిన్నర్. గతంలో నొవాక్ జకోవిచ్, రాఫెల్ నాదల్, ఆండ్రే అగస్సీ ఈ ఘనత వహించారు.
దిగ్గజాల సరసన సిన్నర్- మియామి ఓపెన్ ఫైనల్లో బెర్తు - మియామి ఓపెన్
ఇటలీ టెన్నిస్ సంచలనం జన్నిక్ సిన్నర్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఫ్లోరిడా వేదికగా జరుగుతున్న మియామి ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. సెమీస్లో 5-7, 6-4, 6-4తో స్పెయిన్ ప్లేయర్ అగట్పై విజయం సాధించాడు.
జన్నిక్ మరో ఫీట్.. మియామి ఓపెన్ ఫైనల్లో ప్రవేశం
సెమీస్లో స్పెయిన్ ఆటగాడు రాబర్టో బటిస్టా అగట్పై 5-7, 6-4, 6-4 తేడాతో విజయం సాధించాడు ఈ 19 ఏళ్ల సంచలన ఆటగాడు. తుదిపోరులో పోలాండ్ ఆటగాడు హుబెర్ట్ హుర్కాజ్తో తలపడనున్నాడు. 12 ఏళ్ల ప్రాయంలోనే ఏటీపీ టూర్ టైటిల్ను గెలుపొందాడు సిన్నర్.
ఇదీ చదవండి:12 ఏళ్ల జన్నిక్ సంచలనం- తొలి ఏటీపీ టైటిల్ కైవసం