తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇండియన్​ వెల్స్​లో సంచలనం - బియాంక ఆండ్రెస్

ఇద్దరి మధ్య పోరు...ఒకరు వింబుల్డన్​ ఛాంపియన్... మరొకరు 18 ఏళ్ల  క్రీడాకారిణి. ఎన్నో ప్రపంచ వేదికల మీద ఆడిన అనుభవం ఒకరిది...తొలిసారి ప్రపంచ టైటిల్​ గెలవాలన్న కసి మరొకరిది. వెరసి ఇండియన్​ వెల్స్​ టోర్నీలో అనుభవాన్ని ఓడించి చరిత్ర సృష్టించింది బియాంక ఆండ్రెస్​.

ఇండియన్​ వెల్స్​లో టీనేజ్ సంచలనం

By

Published : Mar 18, 2019, 9:01 PM IST

Updated : Mar 19, 2019, 8:11 PM IST

కెరీర్​లో 29వ టైటిల్​ కోసం జర్మనీకి చెందిన కెర్బర్​ బరిలోకి దిగుతుంటే....కెనడాకు చెందిన 18 ఏళ్ల 'ఆండ్రెస్'..​ ​ప్రత్యర్థిగా బరిలో నిలిచింది.

  • ఆదివారం జరిగిన 'బీఎన్​పీ పరిబాస్​ 2019'లో తొలి సెట్​ కోసం 41 నిముషాలు పోరాటం చేసింది ఆండ్రెస్​. అనంతరం 6-4 తేడాతో సెట్​ కైవసం చేసుకుంది​. రెండో సెట్​ 3-6 తేడాతో ఓడిపోయింది. దాంతో చివరి సెట్​పై ఒత్తిడి పెరిగింది. అయినా ఏ మాత్రం పట్టు సడలకుండా ఆడి ఆధిపత్యం ప్రదర్శించింది. 6-4తో చివరి సెట్​తో పాటు టైటిల్​ను ఎగరేసుకుపోయిందీ కెనడా చిన్నది.

'బీఎన్​పీ పరిబాస్​ 2019' ఓపెన్​ మహిళల సింగిల్స్​లో ఓ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది ఆండ్రెస్​. చిన్న వయస్సులోనే ఈ ఘనత సాధించి ఛాంపియన్ల సరసన నిలిచింది.

  • ఇండియన్​ వెల్స్​ ఛాంపియన్స్​...(తక్కువ వయస్సులో):
క్రీడాకారిణి సంవత్సరం వయస్సు
సెరెనా విలియమ్స్ 1999 17 సంవత్సరాల 169 రోజులు
మార్టినా హింగిస్ 1998 17 సంవత్సరాల 166 రోజులు
మోనికా సెలెస్ 1992 18 సంవత్సరాల 90 రోజులు
డేనియల్​ హంట్చోవా 2002 18 సంవత్సరాల 327 రోజులు
మారియా షరపోవా 2006 18 సంవత్సరాల 333 రోజులు
బియాంక ఆండ్రెస్ 2019 18 సంవత్సరాల 274 రోజులు

ఎవరీ ఆండ్రెస్​....?

2000,జూన్​ 16నకెనడాలోని ఒంటారియోలో జన్మించింది ఈ భామ. పూర్తి పేరు బియాంక వనెస్సా ఆండ్రెస్​.

కెనడా క్రీడాకారిణి బియాంక వనెస్సా ఆండ్రెస్​.
  • రికార్డుల రారాణి...

2014- అండర్​14 విభాగంలో ప్రపంచస్థాయిలో ప్రతిష్ఠాత్మకంగా భావించే 'లెస్​ పెటిట్స్​' కప్పు గెలుచుకొంది.

2015- అండర్​-16, 18 టైటిల్స్​ను గెలిచి కెనడాలో అత్యుత్తమ జూనియర్​ క్రీడాకారిణిగా పేరు సంపాదించింది.

2016- తొలి ప్రొఫెషనల్​ టైటిల్​ 'గెటినా 25కే' గెలిచి అందరి దృష్టిని ఆకర్షించింది.

2017- జూనియర్​ విభాగంలోని డబుల్స్​ క్రీడాకారిణిగా ఆస్ట్రేలియా ఓపెన్​, ఫ్రెంచ్​ ఓపెన్​ టైటిల్​ సొంతం చేసుకుంది.

2019- ప్రపంచ టెన్నిస్​ అసోసియేషన్​ నిర్వహించే 125కే టైటిల్​ గెలిచి కెరీర్​లోనే 68వ ర్యాంకు సాధించింది.

తాజాగాఇండియన్​ వెల్స్​ టోర్నీ మహిళల సింగిల్స్​ టైటిల్​ గెలిచింది. మార్చి 18న ప్రకటించిన ప్రపంచ మహిళా సింగిల్స్​ ర్యాకింగ్స్​లో కెరీర్లో అత్యుత్తమంగా 24వ స్థానానికి దూసుకెళ్లింది.

Last Updated : Mar 19, 2019, 8:11 PM IST

ABOUT THE AUTHOR

...view details