తెలంగాణ

telangana

ETV Bharat / sports

హోబర్ట్​ ఇంటర్నేషనల్​ సెమీఫైనల్లో సానియా జోడీ - Hobart International 2020 sania mirza

భారత టెన్నిస్​ అగ్రక్రీడాకారిణి సానియా మీర్జా... రీఎంట్రీలో సత్తా చాటుతోంది. హోబర్ట్​ ఇంటర్నేషనల్​ టోర్నీ డబుల్స్​ విభాగంలో సానియా జోడీ సెమీఫైనల్​ చేరింది.

Indian tennis ace Sania Mirza enters women's doubles semifinals of Hobart International 2020
హోబర్ట్​ ఇంటర్నేషనల్​ సెమీఫైనల్లో సానియా జోడీ

By

Published : Jan 16, 2020, 1:14 PM IST

భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా పునరాగమనంలో విజయాల పరంపర కొనసాగిస్తోంది. రెండేళ్ల తర్వాత ప్రొఫెషనల్‌ టెన్నిస్‌లో రీఎంట్రీ ఇచ్చిన ఈ హైదరాబాదీ భామ.. హోబర్ట్‌ ఇంటర్నేషనల్‌ టోర్నీలో సెమీఫైనల్​ చేరింది.

గురువారం జరిగిన మహిళల డబుల్స్‌ క్వార్టర్స్​లో సానియా- నదియా (ఉక్రెయిన్‌) 6-2, 4-6, 10-4 తేడాతో వేనియా కింగ్​- క్రిస్టినా మెక్​హేల్​(ఆసీస్​ ద్వయం)పై నెగ్గారు. ఈ మ్యాచ్​ గంట 24 నిముషాల పాటు జరిగింది. తర్వాత మ్యాచ్​లో తమరా జిడన్​సెక్​(స్లోవేనియా)-మారి బోజ్​కోవా(చెక్​ రిపబ్లిక్​) జంటతో తలపనుంది సానియా జోడీ.

ఈ టోర్నీకి ముందు సానియా మీర్జా 2017 అక్టోబరులో చైనా ఓపెన్‌ ఆడింది. మోకాలి గాయం.. ఆ తర్వాత బిడ్డ ఇషాన్​కు జన్మనివ్వడం కారణంగా ఆమె రెండేళ్లకుపైగా ఆటకు దూరమైంది. ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్​లో స్థానం సంపాదించేందుకు తీవ్రంగా కసరత్తులు చేసి ఫిట్​నెస్​ మెరుగుపర్చుకుందీ 33 ఏళ్ల స్టార్​ ప్లేయర్​.

ABOUT THE AUTHOR

...view details