తెలంగాణ

telangana

ETV Bharat / sports

డెవిస్​ కప్: 55 ఏళ్ల తర్వాత పాక్​కు భారత​ జట్టు - mahesh bhuapthi

డెవిస్​ కప్​లో ఆడేందుకు భారత్ టెన్నిస్ జట్టు పాకిస్థాన్​కు వెళ్లనుంది. 55 ఏళ్ల తర్వాత పాకిస్థాన్​ గడ్డపై ఆడనుంది. 1964 లాహోర్​లో జరిగిన డెవిస్ ​కప్​ టోర్నీలో భారత జట్టు ఆడింది.

డెవిస్​కప్

By

Published : Jun 27, 2019, 7:30 AM IST

భారత డెవిస్​కప్​ టీమ్ పాకిస్థాన్ వెళ్లనుంది. 55 ఏళ్ల తర్వాత దాయాది జట్టులో టెన్నిస్ టోర్నీ ఆడనుంది. ఇందుకు సంబంధించి అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకుంది. చివరి సారిగా 1964లో భారత్​ లాహోర్​ వెళ్లింది.

"డెవిస్​కప్​లో ఆడేందుకు పాకిస్థాన్ వెళ్లడానికి కేంద్రానికి లేఖ రాశాం. ఇది ద్వైపాక్షిక సిరీస్​ కాకపోవడంతో ప్రభుత్వం పాక్ వెళ్లేందుకు అనుమంతించింది" -హిరోన్మయి ఛటర్జీ, ఏఐటీఏ జనరల్ సెక్రటరీ

మహేశ్ భూపతి, లియాండర్​ పేస్​, ప్రకాశ్ అమృతరాజ్, రోహన్ బోపన్నలతో కూడిన జట్టు పాక్​కు వెళ్లనుంది. చివరగా ఇరు దేశాలు 2006 ముంబయిలో జరిగిన మ్యాచ్​లో తలపడ్డాయి. 3-2 తేడాతో భారత్ విజయం సాధించింది.

ఇది చదవండి: కివీస్​కు తొలి ఓటమి.. పాక్​ చేతిలో పరాభవం

ABOUT THE AUTHOR

...view details