కజకిస్థాన్‌లోని నూర్-సుల్తాన్ వేదికగా జరిగిన డేవిస్‌కప్‌లో భారత్ తిరుగులేని ప్రదర్శనతో ఆకట్టుకుంది. సీనియర్ ఆటగాడు లియాండర్ పేస్ మెరిసిన వేళ భారత బృందం 4-0తో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. ఐదు మ్యాచ్‌ల్లో 4-0 తేడాతో గెలుపొంది డేవిస్ కప్ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించింది.
వయసు పెరిగినా ఆట తగ్గలేదు...
శనివారం జరిగిన డబుల్స్ పోరులో లియాండర్-జీవన్ జోడీ మహ్మద్ షోయబ్-అబ్దుల్ రెహ్మన్‌ను చిత్తు చేసింది. 6-1, 6-3 తేడాతో గెలిచింది భారత జట్టు. 46 ఏళ్ల పేస్ ఆట రెండోరోజు హైలైట్‌గా నిలిచింది. 53 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో పేస్, జీవన్ ధాటికి పాక్ జోడీ నిలవలేకపోయింది.
తొలి సెట్లో ఆరంభంలోనే ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేసి 5-1 తేడాతో ఆధిక్యంలో నిలిచిన పేస్ ద్వయం.. ఆ తర్వాత 6-1తో సెట్ గెలుచుకుంది. రెండో సెట్లో ప్రత్యర్థి కాస్త మెరుగ్గా ఆడి 3-3తో నిలిచినా.. ఎనిమిదో గేమ్‌లో పాక్ జోడీ సర్వీస్ బ్రేక్ చేసిన లియాండర్ ద్వయం.. 5-3తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. చివరికి సర్వీస్ నిలబెట్టుకుని 6-3తో సెట్‌తో పాటు మ్యాచ్ నెగ్గింది.