తెలంగాణ

telangana

ETV Bharat / sports

డేవిస్ కప్: భారత బృందం పర్యటనపై అదే ప్రతిష్టంభన

పాకిస్థాన్​లోని ఇస్లామాబాద్​ వేదికగా జరగనున్న డేవిస్​కప్​ టోర్నీలో భారత్​ పాల్గొనడంపై ఇంకా సందిగ్ధ పరిస్థితే కొనసాగుతోంది. ఈ విషయంపై కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్​ రిజుజు మాట్లాడినా స్పష్టత ఇవ్వలేదు. భారత్​  హాజరయ్యేది, లేనిది ప్రభుత్వం చేతిలోనే ఉందని... ఆదేశాలు ఇంకా రాలేదని వెల్లడించారు.

55 ఏళ్ల తర్వాత..డేవిస్​ కప్​కు తొలగని ఆటంకాలు.!

By

Published : Aug 12, 2019, 6:19 PM IST

Updated : Sep 26, 2019, 6:55 PM IST

భారత టెన్నిస్​ బృందం 'డేవిస్​ కప్​'లో ఆడేందుకు పాకిస్థాన్​ వెళ్తుందా..? దాదాపు 55 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ కోసం భారత ఆటగాళ్లు దాయాది దేశంలో కాలుమోపుతారా...? ఈ ప్రశ్నలకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానాలు లేవు. పాక్​- భారత్​ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో... కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. సోమవారం ఈ అంశంపై కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్​ రిజుజు స్పందించారు.

కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్​ రిజుజు

"డేవిస్​ కప్​... ద్వైపాక్షిక క్రీడ అయితే భారత్​ ఆడేది, లేనిది రాజకీయంగా నిర్ణయం తీసుకొనేవాళ్లం. కానీ ఇది అంతర్జాతీయ టోర్నీ. నిర్వహణ బాధ్యత అంతర్జాతీయ టెన్నిస్​ సంఘం చేతిలో ఉంది. ఒలింపిక్​ కమిటీలో భారత్​ సభ్య దేశం కాబట్టి భారత ప్రభుత్వం, జాతీయ టెన్నిస్​ సంఘం ఈ విషయంపై ఏం మాట్లాడలేని పరిస్థితి. అందుకే టోర్నీలో భారత్​ పాల్గొంటుందా లేదా అని చెప్పలేకపోతున్నాం. అయితే కేంద్ర ప్రభుత్వం ఇంకా ఆదేశాలేం ఇవ్వలేదు".
-- కిరణ్​ రిజుజు, కేంద్ర క్రీడా శాఖ మంత్రి

వేదిక మార్చలేం...

ఆసియా-ఓసియానా జోన్​ గ్రూప్​-1లో లభించిన టై ఫలితంగా పాక్​ జట్టుతో భారత ఆటగాళ్లు తలపడాల్సి ఉంది. సెప్టెంబర్​ 14, 15 తేదీల్లో ఇస్లామాబాద్​ వేదికగా ఈ టెన్నిస్ మ్యాచ్​లు జరగనున్నాయి. తొలుత దాయాది దేశం వెళ్లేందుకు భారత టెన్నిస్​ సంఘం ముందడుగు వేసినా... ఇరుదేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల కారణంగా ఈ అంశంపై సందిగ్ధం నెలకొంది.

ప్రస్తుతం ఇరుదేశాల మధ్య పరిస్థితులు బాగోలేదని, రెండు దేశాలకు చెందని ఓ తటస్థ వేదికపై మ్యాచ్​ నిర్వహించాలని అంతర్జాతీయ టెన్నిస్​ సంఘాన్ని కోరింది భారత టెన్నిస్​ ఫెడరేషన్. దీనిపై స్పందించిన అంతర్జాతీయ కమిటీ... వేదిక మార్చే అవకాశం లేదని ఆదివారం తేల్చిచెప్పింది. ఇప్పటికే ఇస్లామాబాద్​లో క్రీడా నిర్వహణ పనులు దాదాపు పూర్తయినట్లు పేర్కొంది.

1964లో దాయాది దేశంలో చివరిగా కాలుమోపారు భారత టెన్నిస్​ క్రీడాకారులు. 2008లో ముంబయిలో ఉగ్రదాడుల తర్వాత పాక్​తో క్రీడా సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇటీవల జమ్ము కశ్మీర్​కు స్వయం ప్రతిపత్తి అంశమైన ఆర్టికల్​ 370ని భారత ప్రభుత్వం రద్దు చేసింది. దీనిని వ్యతిరేకిస్తూ భారత్​తో ద్వైపాక్షిక సంబంధాలను తెంచేసుకుంది పాకిస్థాన్.

గతంలో పాక్​కు ఛాన్స్​లు...

2015లో పాక్​ నిర్వహించిన క్రీడల్లో వేదికల్ని మార్చారు. చైనీస్​ తైపీ జట్టుతో టర్కీలోనూ, కువైట్​ జట్టుతో కొలంబోలోనూ తలపడింది పాకిస్థాన్. 2016లో చైనా నిర్వహించిన క్రీడల్లో వేదిక మార్చాలని కోరింది పాక్. ఫలితంగా శ్రీలంకలోని కొలంబో వేదికగా మ్యాచ్​ జరిగింది. 2017లో పాకిస్థాన్​ వేదికగా జరిగిన మ్యాచ్​కు వెళ్లేందుకు నిరాకరించింది హాంకాంగ్.

ఇవీ చూడండి...డెవిస్​ కప్: 55 ఏళ్ల తర్వాత పాక్​కు భారత​ జట్టు

Last Updated : Sep 26, 2019, 6:55 PM IST

ABOUT THE AUTHOR

...view details