ప్రాణాంతక కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో పలు టోర్నీలు, లీగ్‌లు వాయిదా పడ్డాయి. అయితే వింబుల్డన్ మాత్రం కచ్చితంగా రద్దవుతుందని అన్నారు జర్మనీ టెన్నిస్ సమాఖ్య ఉపాధ్యక్షుడు డిర్క్ హార్డార్ఫ్. ఈ బుధవారం జరగబోయే బోర్డు సమావేశం తర్వాత తుది నిర్ణయం వెల్లడిస్తారని చెప్పారు.
'వింబుల్డన్ టోర్నీ కచ్చితంగా రద్దవుతుంది' - కరోనా మరణాలు
ప్రముఖ టెన్నిస్ టోర్నీ వింబుల్డన్.. ఈ ఏడాది కచ్చితంగా రద్దవుతుందని చెప్పారు జర్మనీ టెన్నిస్ సమాఖ్య ఉపాధ్యక్షుడు డిర్క్ హార్డార్ఫ్. కరోనా వైరస్ ప్రభావమే ఇందుకు కారణం.
"ఏటీపీ, డబ్ల్యూటీఏల్లో నేను సభ్యుడిగా ఉన్నాను. వింబుల్డన్‌పై ఇప్పటికే ఓ నిర్ణయం ఖరారైంది. బుధవారం జరిగే సమావేశం తర్వాత ఈ టోర్నీ రద్దు విషయం బయటకొస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అనివార్యం" -డిర్క్ హార్డార్ఫ్, జర్మనీ టెన్నిస్ సమాఖ్య ఉపాధ్యక్షుడు
షెడ్యూల్ ప్రకారం.. ఈ ఏడాది జూన్ 29 నుంచి జులై 12 వరకు వింబుల్డన్ జరగాల్సి ఉంది. ఇదే విషయంపై గతవారం స్పందించిన ఆల్ ఇంగ్లాండ్ లాన్ టెన్నిస్ క్లబ్.. వింబుల్డన్ రద్దు లేదా వాయిదా పడుతుందని చెప్పింది.