తెలంగాణ

telangana

ETV Bharat / sports

అభిమానుల మధ్యే ఫ్రెంచ్​ ఓపెన్! - French Open 2020 latest news

టెన్నిస్‌ అభిమానులకు శుభవార్త చెప్పిన ఫ్రెంచ్​ టెన్నిస్​ సమాఖ్య అధ్యక్షుడు జీన్​ ఫ్రాంకోయిస్​.. ఈ ఏడాది ఫ్రెంచ్​ ఓపెన్​ను​ అభిమానులు ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కల్పిస్తామని చెప్పారు.

French Open 2020
అభిమానుల మధ్యే ఈ ఏడాది ఫ్రెంచ్​ ఓపెన్!

By

Published : May 29, 2020, 11:09 AM IST

కరోనా ప్రభావంతో వాయిదా పడిన ఫ్రెంచ్‌ ఓపెన్‌.. ఈ ఏడాది సెప్టెంబరు 20 నుంచి నిర్వహించనున్నారు. అయితే ఈ టోర్నీ మ్యాచ్‌లను వీక్షించేందుకు స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించనున్నారట. కొన్ని నిబంధనలతో ఈ అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు ఫ్రెంచ్‌ టెన్నిస్‌ సమాఖ్య అధ్యక్షుడు జీన్‌ ఫ్రాంకోయిస్‌.

వీక్షకులు లేకుండా టోర్నీ నిర్వహించాలని అనుకోవట్లేదని జీన్​ తెలిపారు. వారు లేకుండా జరిపితే, ఆసక్తితో పాటు ఆదాయం ఉండదని భావిస్తున్నట్లు చెప్పారు. 15 రోజుల పాటు జరగనున్న ఈ ఈవెంట్​లో భౌతిక దూరం భాగం కానుంది. మీడియా సంస్థలను పరిమితంగానే ఆహ్వానిస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఇప్పటికే జూన్​ 7న జరగాల్సిన ఈ టోర్నీని రద్దు చేసి టికెట్​ డబ్బులను రీఫండ్​ చేశారు. గతేడాది ఫ్రెంచ్​ ఓపెన్​లోని ఓ మ్యాచ్​కు ఏకంగా 5 లక్షల 20 వేల మంది హాజరు కావడం విశేషం.

ఇదీ చూడండి: 'అలా చేస్తే ఐపీఎల్ జరగడం పక్కా'

ABOUT THE AUTHOR

...view details