మానసిక ఆందోళనతో ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించిన జపాన్ అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి, రెండో సీడ్ నవోమి ఒసాకా పట్ల పలువురు అథ్లెట్స్ సహా ఫ్రెంచ్ టెన్నిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు గిల్స్ మోరెట్టాన్ విచారం వ్యక్తం చేశారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. వచ్చే సీజన్లో ఆమె పాల్గొనాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
French Open: ఒసాకా వైదొలగడానికి కారణమిదేనా? - osaka out of french open
కుంగుబాటు కారణంగా ఫ్రెంచ్ ఓపెన్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది జపాన్ స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి నవోమి ఒసాకా. దీంతో ఆమె తీసుకున్న నిర్ణయం, తన ఆరోగ్య పరిస్థితి పట్ల విచారం వ్యక్తం చేశారు పలువురు అథ్లెట్లు. ఫ్రెంచ్ టెన్నిస్ ఫెడరేషన్ అధ్యక్షడు గిల్లెస్ మోరెట్టాన్ కూడా ఆవేదన వ్యక్తం చేయడం సహా క్షమాపణలు కూడా చెప్పారు. అయితే ఒసాకా తప్పుకోవడానికి అసలు కారణం ఇది కాదని తెలుస్తోంది.
ఒసాకా
అసలేం జరిగిందంటే?
- ఫ్రెంచ్ ఓపెన్(French Open) తొలి రౌండ్లో రొమేనియా ప్లేయర్ పాట్రిసియా మారియా టిగ్పై 6-4, 7-6(4) తేడాతో విజయం సాధించింది ఒసాకా(Naomi Osaka). దీంతో గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌ల్లో వరుసగా 15వ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
- తొలిరౌండ్‌లో విజయానంతరం మీడియా సమావేశానికి హాజరుకాకపోవడం వల్ల ఒసాకాకు రిఫరీ 15,000 డాలర్ల జరిమానా విధించారు.
- రాబోయే రోజుల్లోనూ ఇలాగే మీడియా సమావేశాలకు దూరంగా ఉండాలనుకుంటే.. కఠినమైన జరిమానాలు విధించడం సహా చర్యలు తీసుకునే అవకాశమూ ఉందని ఒసాకాను హెచ్చరించారు.
- ఈ నేపథ్యంలో అసంతృప్తి చెందిన ఒసాకా టోర్నీ నుంచి వైదొలుగుతూ.. మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడకుండా ఉండేందుకు తాను ఫ్రెంచ్ ఓపెన్ సందర్భంగా మీడియాతో మాట్లాడలేదని వివరణ ఇచ్చింది. 2018 యూఎస్ ఓపెన్ నుంచి తాను మానసిక కుంగుబాటుతో బాధపడుతున్నట్లు, అందుకే తప్పుకొంటున్నట్లు ట్వీట్ చేసింది.
- ఇప్పటివరకు ఒసాకా నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను సొంతం చేసుకుంది.
ఇదీ చూడండి: ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకుంటున్న ఒసాకా