తెలంగాణ

telangana

ETV Bharat / sports

12వ సారి: ఫ్రెంచ్ ఓపెన్​​ టైటిల్​ విజేత నాదల్​ - rafael

ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్​ చివరికి నాదల్​కే దక్కింది. పైనల్​లో ఆస్ట్రియా ఆటగాడు థీమ్​పై విజయం సాధించాడు రఫా. నాదల్​కు ఇది 12వ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్​.

ఫ్రెంచ్ ఓపెన్

By

Published : Jun 9, 2019, 11:50 PM IST

Updated : Jun 10, 2019, 5:38 AM IST

12వ సారి: ఫ్రెంచ్ ఓపెన్​​ టైటిల్​ విజేత నాదల్​

ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్​ను 12వ సారి కైవసం చేసుకున్నాడు రఫెల్ నాదల్. ఫైనల్​లో ఆస్ట్రియాకు చెందిన డొమనీక్​ థీమ్​ను ఓడించి విజేతగా నిలిచాడు. 6-3, 5-7, 6-1, 6-1 తేడాతో వరుసగా మూడో ఏడాది ఫ్రెంచ్​ టైటిల్​ నెగ్గాడు రఫా.

మొదటి సెట్లో సునాయసంగా గెలిచిన నాదల్... రెండో సెట్లో ప్రత్యర్థి ధాటికి నిలువలేకపోయాడు. ఆ సెట్ ఓడిన రఫా తిరిగి తర్వాతి సెట్లలో తడాఖా చూపించాడు. వరుసగా మూడు, నాలుగు సెట్లు గెలిచి టైటిల్ సొంతం చేసుకున్నాడు స్పెయిన్ బుల్.

నాదల్ - థీమ్​

రఫెల్ నాదల్​కిది 12వ ఫ్రెంచ్ టైటిల్. ఈ గ్రాండ్​స్లామ్​తో కలిపి మొత్తం 18 ట్రోఫీలు సొంతం చేసుకున్నాడు రఫా. 20 ట్రోఫీలతో ఫెదరర్​ అగ్రస్థానంలో ఉన్నాడు.

Last Updated : Jun 10, 2019, 5:38 AM IST

ABOUT THE AUTHOR

...view details