డిఫెండింగ్ ఛాంపియన్ హలెప్‌ను క్వార్టర్స్‌లో ఓడించి సంచలనం సృష్టించిన 17ఏళ్ల అమెరికా యువ కెరటం అనిసిమోవా పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్‌లో అనిసిమోవా 7-6 (7-4), 3-6, 3-6తో ఆష్లీ బార్టీ (ఆస్ట్రేలియా) చేతిలో ఓటమి పాలైంది. మ్యాచ్‌లో మొత్తం 40 విన్నర్లు, 5 ఏస్‌లు కొట్టిన బార్టీ.. ఏకంగా ఎనిమిది సార్లు అనిసిమోవా సర్వీస్‌ను బ్రేక్ చేసింది.
ఉత్కంఠగా సాగిన మరో సెమీస్‌లో వొంద్రుసోవా (చెక్ రిపబ్లిక్) 7-5, 7-6 (7-2)తో జోహానా కొంటా (బ్రిటన్)పై వరుస సెట్లలో విజయం సాధించింది.