తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఫ్రెంచ్​ ఓపెన్​ సెమీస్​లో ఫెదరర్ ​X నాదల్ - స్పెయిన్​ బుల్​ రఫెల్​ నదాల్.

​ఫ్రెంచ్​ ఓపెన్​లో రసవత్తరమైన పోరు జరగనుంది. క్వార్టర్ ఫైనల్స్​లో విజయం సాధించిన... స్విస్​ స్టార్​ రోజర్​ ఫెదరర్​, స్పెయిన్​ బుల్​ రఫెల్​ నాదల్​లు సెమీ ఫైనల్లో తలపడనున్నారు. శుక్రవారం జరిగే సెమీస్​లో ఇద్దరూ అమీతుమీ తేల్చుకోనున్నారు.

ఫ్రెంచ్​ ఓపెన్​ సెమిస్​లో ఫెదరర్ ​X నడాల్

By

Published : Jun 5, 2019, 6:30 AM IST

Updated : Jun 5, 2019, 8:32 AM IST

టెన్నిస్​ దిగ్గజాలు ఫెదరర్​, రఫెల్​ నాదల్​.. ఫ్రెంచ్​ ఓపెన్​ గ్రాండ్​స్లామ్​ సెమీ ఫైనల్​లో అడుగుపెట్టారు. ప్రత్యర్థులను చిత్తు చేస్తూ.. క్వార్టర్స్​ను విజయవంతంగా దాటిన వీరు ​ సెమీస్​లో పరస్పరం పోటీ పడేందుకు సిద్ధమయ్యారు.

37 ఏళ్లలోనూ తగ్గని జోరు

చాలా రోజుల తర్వాత ఫ్రెంచ్​ ఓపెన్ ఆడుతోన్న టెన్నిస్​ స్టార్​ ఆటగాడు రోజర్​ ఫెదరర్ సెమీస్​లోకి ప్రవేశించాడు. నాలుగో రౌండ్​లో స్విట్జర్లాండ్​ ఆటాగాడు స్టాన్​ వావ్రింకాపై 7-6, 4-6, 7-6, 6-4 తేడాతో చెమటోడ్చి నెగ్గాడు. సుమారు మూడు గంటల 35 నిముషాలు జరిగిన ఈ పోరులో చివరికి ఫెదరర్​ విజయం సాధించాడు.

  • 37 ఏళ్ల వయసులో ఫ్రెంచ్​ఓపెన్​ సెమీ ఫైనల్​ చేరిన పెద్ద వయస్కుడిగా రికార్డు సృష్టించాడు ఫెదరర్​. 1968లో పాంచో గోంజలెస్​ పేరిట ఈ రికార్డు ఉండేది.

విజయాల వీరుడు

టైటిల్​ ఫేవరెట్లలో ఒకడైన స్పెయిన్​ బుల్​ రఫెల్​ నాదల్.. జపాన్​ ఆటగాడు కియ్​ నిషికొరిని 6-1, 6-1, 6-3 తేడాతో వరుస సెట్లలో ఓడించాడు. గంటా 51 నిమిషాల పాటు జరిగిన పోరులో నాదల్​ సులువుగా విజయం సాధించాడు. ఈ మ్యాచ్​కు కాసేపు వరుణుడు ఆటంకం కలిగించినా... ఆట ప్రారంభం కాగానే తనదైన రీతిలో విజృభించి గెలుపును ఖాతాలో వేసుకున్నాడు నాదల్​.

  • గ్రాండ్​ స్లామ్​ సెమీ ఫైనల్​కు చేరుకోవడం నాదల్​కిది 31వసారి. రోజర్​ ఫెదరర్​, జకోవిచ్​, జిమ్మీ కాన్నర్స్​ తర్వాత అత్యధికసార్లు గ్రాండ్​ స్లామ్​ టోర్నీల్లో సెమీస్​ చేరిన ఆటగాడిగా నిలిచాడు. ఫ్రెంచ్​ ఓపెన్​లో 93 మ్యాచులు ఆడిన రఫెల్​ 91 విజయాలు నమోదు చేశాడు. 11సార్లు టైటిల్​ గెలిచాడు.

రెండోసారి ఫ్రెంచ్​ ఓపెన్​ టైటిల్​ కోసం ఫెదరర్​, 12వ ట్రోఫీని ముద్దాడేందుకు నాదల్​ సెమీఫైనల్లో పోటీపడనున్నారు. మరి సెమీస్​లో గెలిచి.. ఫైనల్​ చేరే దిగ్గజమెవరో తెలియాలంటే శుక్రవారం మ్యాచ్​ ముగిసే వరకు వేచిచూడాలి.

Last Updated : Jun 5, 2019, 8:32 AM IST

ABOUT THE AUTHOR

...view details