487 రోజుల తర్వాత గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఆడుతున్న స్విస్ మాస్టర్ రోజర్ ఫెదరర్(Federer) ఘనంగా తొలి అడుగు వేశాడు. తన శైలి ఆటతో ఫ్రెంచ్ ఓపెన్లో శుభారంభం చేశాడు. సోమవారం పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఎనిమిదో సీడ్ రోజర్ 6-2, 6-4, 6-3తో క్వాలిఫయర్ డెన్నిస్ ఇస్తోమిన్ (ఉజ్బెకిస్థాన్)ను వరుస సెట్లలో ఓడించాడు. గత 16 నెలల్లో కేవలం 2 టోర్నీలే ఆడిన 39 ఏళ్ల ఫెదరర్.. ఇస్తోమిన్‌తో పోరులో దూకుడు ప్రదర్శించాడు. నెట్ డ్రాప్‌లు, బ్యాక్‌హ్యాండ్ విన్నర్లతో అలరించిన రోజర్.. ప్రత్యర్థికి 13 పాయింట్లు మాత్రమే కోల్పోయాడు. 93 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆట కట్టించిన అతడు.. 48 విన్నర్లు కొట్టడమే కాదు అయిదుసార్లు ఇస్తోమిన్ సర్వీస్ బ్రేక్ చేశాడు. ఈ క్రమంలో ఎనిమిది ఏస్‌లు కూడా సంధించాడు. 2019 ఫ్రెంచ్ ఓపెన్(French Open) సెమీస్‌లో నాదల్ చేతిలో ఓడిన తర్వాత రొలాండ్ గారోస్‌లో అడుగుపెట్టడం రోజర్‌కిదే తొలిసారి. చివరగా రోజర్ ఆడిన గ్రాండ్‌స్లామ్ టోర్నీ 2020 ఆస్ట్రేలియన్ ఓపెన్.
మెద్వెదెవ్ ఎట్టకేలకు
గత నాలుగు ఫ్రెంచ్ ఓపెన్లలో రష్యా కుర్రాడు డానియల్ మెద్వెదెవ్(Medvedev) ఎప్పుడూ తొలి రౌండ్ దాటలేదు. కానీ ఈసారి ఆ అడ్డంకిని అధిగమించాడు. తొలి రౌండ్లో 6-3, 6-3, 7-5తో బబ్లిక్ (కజకిస్థాన్)ను ఓడించి రొలాండ్ గారోస్‌లో తొలి విజయాన్ని అందుకున్నాడు. ఈ పోరులో మూడో సెట్లో తప్ప ప్రత్యర్థి నుంచి మెద్వెదెవ్‌కు పెద్దగా ప్రతిఘటన ఎదురు కాలేదు. రూడ్ (నార్వే), సినర్ (ఇటలీ), ఇస్నర్ (అమెరికా) తొలి రౌండ్ దాటారు. రూడ్ 5-7, 6-2, 6-1, 7-6 (7/4)తో బెన్నిట్ పైర్ (ఫ్రాన్స్)పై గెలవగా, సినర్ 6-1, 4-6, 6-7 (4/7), 7-5, 6-4తో హోబర్ట్ (ఫ్రాన్స్)పై గెలిచాడు. ఇస్నర్ 7-6 (7/2), 6-3, 6-4తో క్వెరీ (అమెరికా)పై నెగ్గాడు. కాగా, అమెరికా సంచలనం కొర్డా తొలి రౌండ్లోనే ఓడాడు. మార్టినెజ్ (స్పెయిన్), 6-4, 6-2, 6-2తో కొర్డాపై గెలిచాడు. సిట్సిపాస్ (గ్రీస్), జ్వెరెవ్ (జర్మనీ), నిషికొరి (జపాన్), సిలిచ్ (క్రొయేషియా), ఒపెల్కా (అమెరికా), బాసిల్‌ష్వెలి (జార్జియా), క్రాజినోవిచ్ (సెర్బియా), నోరె (బ్రిటన్), జాన్సన్ (అమెరికా) తొలి రౌండ్‌ను అధిగమించారు.
స్వైటెక్ శుభారంభం