తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఫ్రెంచ్​ ఓపెన్​ క్వార్టర్స్​లో రఫా, ఫెదరర్ - నదాల్​

ఫ్రెంచ్​ ఓపెన్​లో దిగ్గజ ఆటగాళ్ల జోరు కొనసాగుతోంది. స్విస్​ స్టార్​ రోజర్​ ఫెదరర్​, స్పెయిన్​ బుల్​ రఫెల్​ నదాల్​లు క్వార్టర్​ ఫైనల్లోకి ప్రవేశించారు. మహిళల సింగిల్స్​లో బ్రిటన్​ క్రీడాకారిణి కొంటా.. క్వార్టర్స్​కు చేరింది.

ఫ్రెంచ్​ ఓపెన్​ క్వార్టర్స్​లో రఫా, ఫెదరర్

By

Published : Jun 3, 2019, 7:01 AM IST

ఫ్రెంచ్​ ఓఫెన్​ క్వార్టర్స్​లో నదాల్​, ఫెదరర్​, వావ్రింకా, కొంటా, స్టీఫెన్స్​

మూడేళ్ల తర్వాత ఫ్రెంచ్​ ఓపెన్ ఆడుతున్న టెన్నిస్​ స్టార్​ ఆటగాడు రోజర్​ ఫెదరర్​ క్వార్టర్స్​లోకి ప్రవేశించాడు. ప్రిక్వార్టర్స్​లో అర్జెంటీనా ఆటగాడు లియోనార్డో మేయర్​ను 6-2, 6-3, 6-3 తేడాతో వరుస సెట్లలో చిత్తు చేశాడు. గంటా 42 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్​లో ఫెదరర్​ దూకుడు ముందు నిలవలేకపోయాడు మేయర్​.

ఫెదరర్​

గ్రాండ్​స్లామ్​ టోర్నీలో క్వార్టర్స్​కు చేరడం ఫెదరర్​కిది 54వ సారి. ప్రస్తుతం జరుగుతున్న ఫ్రెంచ్​ ఓపెన్​లో ఫెదరర్​ ఒక్క సెట్టూ కోల్పోకపోవడం విశేషం.

టైటిల్​ ఫేవరేట్లలో ఒకడైన స్పెయిన్​ బుల్​ రఫెల్​ నదాల్​.. అలవోకగా ప్రిక్వార్టర్స్​ను అధిగమించాడు. రెండో సీడ్​ నదాల్​ లాండెరో(అర్జెంటీనా)ను 6-2, 6-3, 6-3 తేడాతో చిత్తు చేశాడు. ఆరు ఏస్​లతో పాటు.. 40 విన్నర్లు కొట్టారు రఫా. రికార్డు స్థాయిలో 12వ ఫ్రెంచ్​ ఓపెన్​ గ్రాండ్​స్లామ్​ టైటిల్​పై కన్నేసిన నదాల్​.. ప్రత్యర్థుల్ని హడలెత్తిస్తున్నాడు.

నదాల్​ వర్సెస్​ లాండెరో

మరో స్విట్జర్లాండ్​ ఆటగాడు వావ్రింకా.. 7-6, 5-7, 6-4, 3-6, 8-6 తో గ్రీస్​ ఆటగాడు సిట్సిపాస్​పై చెమటోడ్చి నెగ్గాడు.

ఎదురులేని బ్రిటన్​ టీనేజర్​...

మహిళల సింగిల్స్​లో బ్రిటన్​ యువ క్రీడాకారిణి కొంటా.. వికిచ్​(క్రొయేషియా)ను, క్రొయేషియా క్రీడాకారిణి మారిచ్​.. కనెపిని ఓడించి క్వార్టర్స్​కు చేరుకున్నారు.

కొంటా(బ్రిటన్​)
మారిచ్​ (క్రొయేషియా)

అమెరికాకు చెందిన ఏడో సీడ్​ స్టీఫెన్స్​.. 19వ సీడ్​ ముగురుజ(స్పెయిన్​)ను 6-4, 6-3 తేడాతో వరుస సెట్లలో ఓడించింది. క్వార్టర్స్​లో కొంటాతో తలపడనుంది. స్టీఫెన్స్​ గతేడాది ఫ్రెంచ్​ ఓపెన్​లో రన్నరప్​గా నిలిచింది. ముగురుజ 2016లో ఈ గ్రాండ్​స్లామ్​ టోర్నీని నెగ్గిన క్రీడాకారిణి కావడం గమనార్హం.

స్టీఫెన్స్​ వర్సెస్​ ముగురుజ

బోపన్న ఓటమి...

పురుషుల డబుల్స్​లో భారత జంట రోహన్​ బోపన్న పోరాటం ముగిసింది. ప్రిక్వార్టర్స్​లో బోపన్న-మారిస్​(రొమేనియా) జోడి సెర్బియా జంట చేతిలో ఓడింది.

ABOUT THE AUTHOR

...view details