కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. ఫ్రెంచ్ ఓపెన్ వారం రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుంది. మట్టికోర్టులో నిర్వహించే ఈ గ్రాండ్‌స్లామ్ టోర్నీని మే 23న మొదలుపెట్టాలని నిర్వాహకులు తొలుత నిర్ణయించారు. కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా ఇప్పుడు దానిని వారంపాటు వాయిదా వేశారు.
కరోనా ఎఫెక్ట్.. ఫ్రెంచ్ ఓపెన్ వారం ఆలస్యం - tennis latest news
కరోనా ప్రభావం గ్రాండ్‌స్లామ్ టోర్నీపై పడింది. దీంతో వారం రోజులు ఆలస్యంగా ఫ్రెంచ్ ఓపెన్ మొదలు కానుంది.
కరోనా ఎఫెక్ట్.. ఫ్రెంచ్ ఓపెన్ వారం ఆలస్యం
సురక్షితమైన వాతావరణంలో సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రేక్షకుల మధ్య టోర్నీ నిర్వహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫ్రెంచ్ టెన్నిస్ సమాఖ్య తెలిపింది. ఈ నిర్ణయంతో మే 30న టోర్నీ ప్రారంభమవుతుంది. గతేడాది మేలో జరగాల్సిన ఫ్రెంచ్ ఓపెన్‌ను కరోనా కారణంగా 4 నెలలు వాయిదా వేసి సెప్టెంబర్‌లో నిర్వహించారు. రోజుకు 1000 మంది ప్రేక్షకులను మాత్రమే అనుమతించారు.