తెలంగాణ

telangana

By

Published : May 8, 2020, 1:03 PM IST

ETV Bharat / sports

డబ్బులు తిరిగిచ్చేందుకు టోర్నీ నిర్వహకులు సిద్ధం

'ఫ్రెంచ్ ఓపెన్' వాయిదా పడిన కారణంగా, టికెట్లు కొనుగోలు చేసిన వారికి డబ్బులు తిరిగిచ్చేయాలని నిర్ణయించింది ఫ్రెంచ్ టెన్నిస్ సమాఖ్య. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది.

French Open
ఫ్రెంచ్​ ఓపెన్​ టోర్నీ

ఈ నెల చివరి వారంలో ప్రారంభం కావాల్సిన ఫ్రెంచ్‌ ఓపెన్.. ప్రాణాంతక కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేసిన వారికి రీఫండ్ ఇవ్వాలని ఫ్రెంచ్‌ టెన్నిస్‌ సమాఖ్య (ఎఫ్‌టీఎఫ్‌) నిర్వహకులు నిర్ణయించారు.

షెడ్యూల్​ ప్రకారం మే 24 నుంచి జూన్‌ 7 వరకు టోర్నీ జరగాల్సి ఉంది. దీనిని ఇప్పుడు సెప్టెంబర్‌కు 27 నుంచి అక్టోబరు 11 జరపాలని భావిస్తున్నారు. అయితే వైరస్​ తీవ్రత రోజురోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో అప్పుడూ జరుగుతుందా? లేదా? అనేది సందేహంగా మారింది.

ఇదీ చూడండి : వారి కోసం మళ్లీ బాక్సింగ్‌ రింగ్‌లోకి దిగ్గజాలు

ABOUT THE AUTHOR

...view details