ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ నొవాక్ జకోవిచ్ మరో అడుగు ముందుకేశాడు. మూడో రౌండ్లో నొవాక్ 6-3, 6-3, 6-2తో కారుసో (ఇటలీ)పై విజయం సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఎనిమిది ఏస్‌లు కొట్టిన జకో.. ఐదుసార్లు ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేశాడు.
ప్రిక్వార్టర్స్ చేరిన గ్రీక్ ఆటగాడు...
గ్రీసు వీరుడు సిట్సిపాస్ ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. మూడో రౌండ్లో 7-5, 6-3, 6-7 (7-5), 7-6 (8-6)తో క్రాజానోవిచ్ (క్రొయేషియా)పై చెమటోడ్చి గెలిచాడు సిట్రిపాస్. గత 83 ఏళ్లలో రొలాండ్ గారోస్‌లో ప్రిక్వార్టర్స్ చేరిన తొలి గ్రీకు ఆటగాడిగా సిట్సిపాస్ ఘనత సాధించాడు.
మోన్‌ఫిల్స్ 6-3, 6-2, 6-3తో హయాంగ్ (ఫ్రాన్స్)ను ఓడించగా.. ఫాగ్‌నిని 7-6, (7-5), 6-4, 4-6, 6-1తో బటిస్టా అగట్ (స్పెయిన్)పై గెలిచాడు. ఫలితంగా మోన్‌ఫిల్స్ , ఫాగ్‌నిని ప్రిక్వార్టర్స్ చేరారు.