తెలంగాణ

telangana

ETV Bharat / sports

నాదల్ రికార్డ్.. స్వైటక్‌ సరికొత్త చరిత్ర - ఫ్రెంచ్ ఓపెన్ వార్తలు

పారిస్ వేదికగా జరుగుతున్న ఫ్రెంచ్​ ఓపెన్​లో నాదల్ రికార్డు సృష్టించాడు. గ్రాండ్​స్లామ్​లో వందో మ్యాచ్​ ఆడుతూ, అందులో గెలిచాడు. టీనేజీ స్టార్ స్వైటాక్.. సెమీస్​లో అడుగుపెట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది.

french open 2020 latest results news
నాదల్ రికార్డ.. స్వైటక్‌ సరికొత్త చరిత్ర

By

Published : Oct 8, 2020, 6:21 AM IST

Updated : Oct 8, 2020, 6:27 AM IST

పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్‌ నాదల్‌ (స్పెయిన్‌)కు తిరుగులేకుండా పోయింది. తనకు అచ్చొచ్చిన ఎర్రమట్టి కోర్టుపై అతను వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున ముగిసిన క్వార్టర్స్‌లో నాదల్‌ 7-6 (7-4), 6-4, 6-1 తేడాతో ఇటలీ కుర్రాడు జానిక్‌ సిన్నర్‌పై గెలుపొందాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో నాదల్‌కు ఇది వందో మ్యాచ్‌.

ఫ్రెంచ్‌ ఓపెన్లో ఇప్పటివరకూ వంద మ్యాచ్‌లాడిన నాదల్‌ 98 విజయాలు సాధించాడు. కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడిపోయాడు. అతను ఈ టోర్నీలో సెమీస్‌ చేరిన ప్రతిసారి టైటిల్‌ నెగ్గాడు.

తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ క్వార్టర్స్‌ ఆడుతున్న 19 ఏళ్ల సిన్నర్‌ నుంచి మొదటి సెట్లో నాదల్‌కు గట్టిపోటీ ఎదురైంది. ప్రపంచ రెండో ర్యాంకర్‌ నాదల్‌, 75వ ర్యాంకర్‌ సిన్నర్‌ పోటాపోటీగా తలపడడం వల్ల తొలిసెట్‌ హోరాహోరీగా సాగింది. నాదల్‌ ఈ సెట్‌ను టైబ్రేకర్‌లో గెలుచుకున్నాడు. తర్వాతి రెండు సెట్లను అతడు సులభంగానే సొంతం చేసుకున్నాడు.

మరో క్వార్టర్స్‌లో ఐదో సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌) 7-5, 6-2, 6-3 తేడాతో 13వ సీడ్‌ రుబ్లెవ్‌ (రష్యా)ను ఓడించి తొలిసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ సెమీస్‌లో అడుగుపెట్టాడు. మరోవైపు 5 గంటల 8 నిమిషాల పాటు ఉత్కంఠభరితంగా సాగిన మారథాన్‌ పోరులో 12వ సీడ్‌ డీగో ష్వార్జ్‌మన్‌ (అర్జెంటీనా) 7-6 (7-1), 5-7, 6-7 (6-8), 7-6 (7-5), 6-2తో మూడో సీడ్‌ థీమ్‌ (ఆస్ట్రియా)ను ఓడించాడు.

సరికొత్త చరిత్ర:

స్వైటక్‌

మహిళల సింగిల్స్‌లో టీనేజీ సంచలనం ఇగా స్వైటక్‌ సరికొత్త చరిత్ర నమోదు చేసింది. ప్రిక్వార్టర్స్‌లో టాప్‌సీడ్‌ హలెప్‌ను ఓడించిన ఆమె.. అదే జోరులో సెమీస్‌ చేరి ఓపెన్‌ శకంలో ఫ్రెంచ్‌ ఓపెన్లో ఆ ఘనత సాధించిన తొలి పోలాండ్‌ అమ్మాయిగా నిలిచింది. క్వార్టర్స్‌లో తను 6-3, 6-1తో ఇటలీ క్వాలిఫయర్‌ ట్రెవిసన్‌ కథ ముగించింది. ఏడో సీడ్‌ క్విటోవా (చెక్‌ రిపబ్లిక్‌) ఎనిమిదేళ్ల తర్వాత ఫ్రెంచ్‌ ఓపెన్‌ సెమీస్‌లో అడుగుపెట్టింది. బుధవారం క్వార్టర్స్‌లో ఆమె 6-3, 6-3తో సిగ్మండ్‌ (జర్మనీ)ను వరుస సెట్లలో చిత్తుచేసింది. నాలుగో సీడ్‌ కెనిన్‌ (యుఎస్‌ఏ) 6-4, 4-6, 6-0తో సహచరిణి కొలిన్స్‌పై విజయం సాధించింది.

Last Updated : Oct 8, 2020, 6:27 AM IST

ABOUT THE AUTHOR

...view details