మరోసారి కెరీర్ గ్రాండ్ స్లామ్ గెలవాలని కలలు కన్న డిఫెండింగ్ ఛాంపియన్ సిమోనా హలెప్ (రొమేనియా)కు చుక్కెదురైంది. పదిహేడేళ్ల అమెరికా యువ తార అనిసిమోవా మూడో సీడ్ హలెప్‌కు షాకిచ్చింది. మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో హలెప్ 2-6, 4-6 తేడాతో అన్‌సీడెడ్ అనిసిమోవా చేతిలో ఓటమి పాలైంది. 2007లో ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీస్ చేరిన నికోల్ వైదిసోవా (చెక్ రిపబ్లిక్) తర్వాత గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్ చేరిన పిన్న వయస్కురాలిగా గుర్తింపు తెచ్చుకుంది.
ఫ్రెంచ్ ఓపెన్: డిఫెండింగ్ ఛాంపియన్‌కు షాక్ - నికోల్ వైదిసోవా (చెక్ రిపబ్లిక్)
ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో సంచలనం నమోదైంది. మూడో సీడ్, డిఫెండింగ్ ఛాంపియన్ హలెప్‌ను మట్టికరిపించింది అమెరికా అన్‌సీడెడ్ క్రీడాకారిణి అనిసిమోవా. ఫలితంగా నికోల్ వైదిసోవా (చెక్ రిపబ్లిక్) తర్వాత గ్రాండ్‌స్లామ్ టోర్నీ సెమీస్ చేరిన పిన్న వయస్కురాలిగా ఘనత సాధించింది.
డిఫెండింగ్ ఛాంపియన్ హలెప్‌కు 17 ఏళ్ల క్రీడాకారిణి షాక్
మరో క్వార్టర్స్‌లో ఎనిమిదో సీడ్ బార్టీ (ఆస్ట్రేలియా) 6-3, 7-5తో మాడిసన్ కీస్ (అమెరికా)పై జయకేతనం ఎగురవేసింది. శుక్రవారం సెమీస్ మ్యాచ్‌లు జరగనున్నాయి. 8వ సీడ్ బార్టీ (ఆస్ట్రేలియా)తో అనిసిమోవా, మర్కెటా వాండ్రుసోవా (చెక్ రిపబ్లిక్)తో జొహన్నా కొంటా (బ్రిటన్) తలపడనున్నారు.