ఎర్రమట్టి కోర్టు రారాజుగా 12వ సారి ఘనత సాధించాలని ఊవిళ్లూరుతున్న రఫెల్ నాదల్ టైటిల్‌కు అడుగుదూరంలో నిలిచాడు. చిరకాల ప్రత్యర్థి రోజర్ ఫెదరర్‌తోశుక్రవారంజరిగిన సెమీఫైనల్లో పైచేయి సాధించాడు నాదల్.
సెమీస్‌లో స్విస్ దిగ్గజం ఫెదరర్‌పై 6-3, 6-4, 6-2 తేడాతో వరుస సెట్లలో ఘన విజయం సాధించాడు రఫా. ఫలితంగా కెరీర్‌లో 12వ సారి ఫ్రెంచ్ టైటిల్ గెలిచేందుకు మార్గం సుగమం చేసుకున్నాడు.
- జూన్ 9న జరగనున్న ఫైనల్లో అతడు ప్రపంచ నంబర్ 1 నొవాక్ జకోవిచ్- డొమినిక్ థీమ్ మధ్య సెమీస్ మ్యాచ్ విజేతతో తలపడనున్నాడు.
తిరుగులేని ఛాంపియన్...
2005లో తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచిన నాదల్... 2006, 2007, 2008 టైటిళ్లతో కలిపి నాలుగు సార్లు వరుస ఛాంపియన్‌గా అవతరించాడు. ఇందులో మూడు సార్లు ఫెదరర్ ఫైనల్లో తలపడి రన్నరప్‌తో సరిపెట్టుకోవడం గమనార్హం.
- రఫెల్ ఆధిపత్యానికి చెక్ పెడుతూ 2009లో ఫెదరర్ టైటిల్ గెలవగా.. 2010 నుంచి 2014 వరకు మరో ఐదు సార్లు విజేతగా నిలిచాడు రఫా. ఈ ఐదింటిలో రెండు సార్లు జకోవిచ్, ఒక్కసారి ఫెదరర్‌తో ఫైనల్లో పోటీ పడ్డాడు స్పెయిన్ బుల్.