కరోనా వల్ల వచ్చిన లాక్డౌన్తో టెన్నిస్ ప్లేయర్లు దాదాపు ఆనందంగా ఉన్నారని అంటున్నాడు దిగ్గజ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్. ఏడాది మొత్తం టోర్నీలతో బిజీగా ఉండే వాళ్లకు ఇప్పుడు చాలా విశ్రాంతి లభించిందని చెప్పాడు. గాయాలు కావడం వల్ల ఈ సంవత్సరం ఎలాంటి పోటీల్లోనూ పాల్గొనడం లేదని స్పష్టం చేశాడు. టెన్నిస్ రాకెట్ పట్టుకునేది వచ్చే ఏడాదేనని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.
"20 ఏళ్లుగా పర్యటనల్లో మునిగితేలుతున్న నాకు దొరికిన ఈ విశ్రాంతిని ఆస్వాదిస్తున్నాను. కొంతమంది బలవంతంగా ఇంట్లో ఉన్నప్పటికి.. లాక్డౌన్తో 90 శాతం మంది ఆటగాళ్లు ఆనందంగానే ఉన్నారు. ఎందుకంటే టెన్నిస్ షెడ్యూల్స్ అనేవి నిర్విరామంగా ఉంటాయి" అని ఫెదరర్ అన్నాడు.