తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఈ ఏడాది టెన్నిస్​కు ఫెదరర్​ దూరం

మోకాలి శస్త్రచికిత్స తర్వాత మరింత విశ్రాంతి తీసుకోవాల్సిన నేపథ్యంలో, ఈ ఏడాది మొత్తం టెన్నిస్​కు దూరం కానున్నట్లు వెల్లడించాడు స్టార్ ప్లేయర్ ఫెదరర్. ఈ మేరకు ట్వీట్ చేశాడు.

Federer out for remainder of 2020 after injury setback
ఈ ఏడాది టెన్నిస్​ సీజన్​కు ఫెదరర్​ దూరం

By

Published : Jun 10, 2020, 4:46 PM IST

దిగ్గజ టెన్నిస్​ ఆటగాడు, స్విస్​ స్టార్ రోజర్​ ఫెదరర్..‌ ఈ ఏడాది మొత్తానికి టెన్నిస్‌కు దూరం కానున్నట్లు తెలిపాడు. 2021లో ప్రారంభంలో మైదానంలోకి దిగుతానని చెప్పాడు. కుడి మోకాలికి ఇటీవల శస్త్రచికిత్స జరగడం వల్లే, విశ్రాంతి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశాడు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.

20 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల విజేత ఫెదరర్​‌కు, ఈ ఏడాది ఫిబ్రవరిలో కుడి మోకాలికి శస్తచికిత్స జరిగింది. తొలుత నాలుగు నెలల పాటు విశ్రాంతి‌ తీసుకోవాలనుకున్నాడు ఫెదరర్​. కానీ ప్రాణాంతక కరోనాతో టోర్నీలు జరిగేది అనుమానంగా మారిన నేపథ్యంలో ఆటకు ఈ ఏడాది చివరకు దూరంగా ఉండనున్నాడు.

ఈ వైరస్​ కారణంగా ఇప్పటికే వింబుల్డన్​ టోర్నీ రద్దయింది. ఫ్రెంచ్​ ఓపెన్ సెప్టెంబరుకు వాయిదా పడగా, యూఎస్​ ఓపెన్​ నిర్వహణపై త్వరలో స్పష్టత రానుంది.

ఇది చూడండి : మాజీ రంజీ క్రికెటర్ హత్య.. కుమారుడు అరెస్టు

ABOUT THE AUTHOR

...view details