అమెరికాలో జరుగుతున్న మయామీ ఓపెన్‌లో నాలుగోసారి టైటిల్ వేటలో కొనసాగుతున్నాడు ఫెదరర్. ఇప్పటికే మూడుసార్లు విజయం సాధించిన ఈ స్విస్ ఛాంపియన్... మళ్లీ సెమీఫైనల్లో అడుగుపెట్టాడు.
గురువారం కెవిన్ అండర్సన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 6-0, 6-4తో వరుస సెట్లలో విజయం సాధించాడు ఫెదరర్. ప్రారంభం నుంచే ప్రత్యర్థిపై ఎదురుదాడికి దిగిన ఈ ఛాంపియన్.. తన అనుభవంతో సునాయసంగా గెలుపొందాడు. 2018 వింబుల్డన్ రన్నరప్‌గా నిలిచిన కెవిన్‌కు ఓటమి రుచి చూపించాడు.
- 38 సార్లు ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేసిన ఫెదరర్.. ఎక్కడా అవకాశం ఇవ్వలేదు. 26 నిముషాల్లోనే తొలిసెట్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో సెట్లో కెవిన్ కొంత పోటీ ఇచ్చినా చివరకు ఫెదరర్‌నే విజయం వరించింది.
కెవిన్ 2016 తర్వాత ఎప్పుడూ ఇంత దారుణంగా 6-0తో ఓడిపోలేదు. కెవిన్ అంజర్సన్ 353 సెట్ల తర్వాత మళ్లీ ఖాతా తెరవకుండానే ఓటమి చెందాడు.