తెలంగాణ

telangana

ETV Bharat / sports

యూఎస్ ఓపెన్​: క్వార్టర్స్​లో ఫెదరర్ ఓటమి - us open

యూఎస్​ ఓపెన్​లో మరో సంచలనం నమోదైంది. పురుషుల సింగిల్స్​లో అత్యధిక గ్రాండ్​స్లామ్​ల విజేత.. స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్​ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. క్వార్టర్​ ఫైనల్లో బల్గేరియాకు చెందిన గ్రిగర్ దిమిత్రోవ్ చేతిలో పరాజయం చెందాడు.

ఫెదరర్​

By

Published : Sep 4, 2019, 9:47 AM IST

Updated : Sep 29, 2019, 9:28 AM IST

యూఎస్ ఓపెన్​లో ఫెదరర్​ నిష్క్రమణ
యూఎస్ ఓపెన్​లో స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్​ పోరాటం ముగిసింది. క్వార్టర్​ఫైనల్లో బల్గేరియన్ ఆటగాడు గ్రిగర్ దిమిత్రోవ్ చేతిలో పరాజయం చెంది టోర్నీ నుంచి నిష్క్రమించాడు. వింబుల్డన్ ఫైనల్​ మాదిరిగానే పోరాడినప్పటికీ విజయం బల్గేరియన్​నే వరించింది.

6-3, 4-6, 6-3, 4-6, 2-6 తేడాతో ఓటమి చవిచూశాడు. తొలి సెట్లో సులభంగా నెగ్గిన ఫెదరర్ రెండో సెట్లో వెనుకంజ వేశాడు. తిరిగి మూడో సెట్​లో సత్తాచాటి దూకుడు ప్రదర్శించాడు. అయితే అనంతరం ఫెదరర్​కు గ్రిగర్ ఎలాంటి అవకాశమివ్వలేదు. వరుస సెట్లలో గెలిచి సెమీస్​ చేరాడు.

Last Updated : Sep 29, 2019, 9:28 AM IST

ABOUT THE AUTHOR

...view details