తెలంగాణ

telangana

ETV Bharat / sports

యూఎస్‌ ఓపెన్ ఛాంపియన్‌ ఎమ్మాకు కరోనా - ఎమ్మా రదుకానుకు కొవిడ్

Emma Raducanu covid 19: యూఎస్​ ఓపెన్ ఛాంపియన్ ఎమ్మా రదుకానుకు కొవిడ్​ సోకింది. ఈ నేపథ్యంలో అబుదాబి వేదికగా జరగనున్న 'ముబడాల వరల్డ్ టెన్నిస్​ ఛాంపియన్​షిప్'​నకు ఆమె దూరం కానుంది.

emma raducanu
ఎమ్మా రదుకాను

By

Published : Dec 14, 2021, 5:15 PM IST

Emma Raducanu covid 19: యూఎస్‌ ఓపెన్‌ ఛాంపియన్ ఎమ్మా రదుకాను కరోనా బారిన పడింది. దీంతో 'ముబడాల వరల్డ్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌'లో భాగంగా డిసెంబరు 16 - 18 మధ్య అబుదాబిలో జరగాల్సిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌కు ఆమె దూరమైంది.

"అబుదాబిలో అభిమానుల మధ్య మ్యాచ్‌ ఆడాలని చాలా ఆశతో ఎదురు చూశాను. కానీ, దురదృష్టవశాత్తు కరోనా బారిన పడ్డాను. మరో అవకాశం కోసం ఎదురు చూస్తున్నా. కొవిడ్‌ నిబంధనల ప్రకారం.. ప్రస్తుతం నేను ఐసోలేషన్‌లో ఉన్నాను. త్వరలోనే కోర్టులో అడుగు పెడతాను' అని రదుకాను పేర్కొంది.

ఈ విషయంపై టోర్నమెంట్ నిర్వాహకులు స్పందించారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. కాగా, క్రిస్మస్ తర్వాత రదుకాను ఆస్ట్రేలియా బయలు దేరాల్సి ఉంది. గ్రాండ్‌ స్లామ్‌లో భాగంగా ఆమె వచ్చే ఏడాది జనవరి 17 నుంచి ప్రారంభం కానున్న ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో పాల్గొననుంది.

ABOUT THE AUTHOR

...view details