తెలంగాణ

telangana

ETV Bharat / sports

దుబాయ్​ ఓపెన్​ ప్రిక్వార్టర్స్‌లో సానియా జోడి - దుబాయ్​ ఓపెన్​ 2020 సానియా మీర్జా

భారత టెన్నిస్‌ స్టార్​ సానియా మీర్జా.. పునరాగమనంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తోంది. తాజాగా దుబాయ్‌ ఓపెన్‌లోనూ శుభారంభం చేసింది. కరోలిన్‌ గార్సియా( ఫ్రాన్స్‌)తో కలిసి డబుల్స్‌లో ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది సానియా.

Dubai Open 2020
దుబాయ్​ ఓపెన్​ 2020

By

Published : Feb 19, 2020, 9:58 AM IST

Updated : Mar 1, 2020, 7:43 PM IST

సానియా మీర్జా, కరోలిన్‌ గార్సియా (ఫ్రాన్స్‌) జోడి దుబాయ్‌ ఓపెన్‌ మహిళల డబుల్స్‌ విభాగంలో.. ప్రిక్వార్టర్‌ ఫైనల్​ చేరింది. తొలి రౌండ్లో సానియా జంట 6-4, 4-6, 10-8 తేడాతో కుద్రివత్సెవా (రష్యా), కేతరినా స్రెబోత్నిక్‌ (స్లొవేనియా) జోడిపై విజయం సాధించింది. తర్వాత మ్యాచ్​లో ఐదోసీడ్‌ సాయ్‌సై జెంగ్‌ (చైనా)-బార్బరా రెసికోవా (చెక్‌ రిపబ్లిక్‌) జంటతో సానియా జోడి అమీతుమీ తేల్చుకోనుంది.

దుబాయ్​ ఓపెన్​ టైటిల్​

సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ రాకెట్​ పట్టిన 33 ఏళ్ల సానియా.. రీఎంట్రీలోనే టైటిల్​ కొట్టి సత్తా చాటింది. హోబర్ట్​ అంతర్జాతీయ టెన్నిస్​ మహిళల డబుల్స్​లో నదియా(ఉక్రెయిన్​)తో కలిసి ఛాంపియన్​గా అవతరించింది. ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్​లో బరిలోకి దిగాలని భావిస్తోందీ హైదరాబాద్​ అమ్మడు.

Last Updated : Mar 1, 2020, 7:43 PM IST

ABOUT THE AUTHOR

...view details